Bigg Boss 5 Telugu: ఈవారం ఈ ఇద్దరు కంటెస్టెంట్ లు అవుట్… నాగార్జున సంచలన నిర్ణయం..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఐదో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో.. ఇంటి నుండి బయటకు వెళ్లడానికి తొమ్మిదిమంది సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఐదో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ సీక్రెట్ రూమ్ లో  నిర్వహించి..ఆ తర్వాత  ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనేదాన్ని బహిర్గతం చేసి ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఐదో వారం ప్రారంభంలో షాక్ ఇవ్వడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈవారం ఓటింగ్ ప్రక్రియ మరి కొద్ది గంటలలో ముగియనున్న క్రమంలో… ఆఫీషియల్ పోల్ సైట్ బట్టి చూస్తే ఇద్దరికీ ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆ ఇద్దరు మరెవరో కాదు లోబో, జెస్సీ. గత వారమే లోబో.. ఎలిమినేషన్ నుండి త్రుటిలో తప్పించుకున్నాడు.

Bigg Boss 5 Telugu: నువ్ చటాక్ అంత ఉన్నావ్ నాతో పెట్టుకోకు.. సిరికి ఇచ్చి  పడేసిన లోబో.. చివరకు | Bigg boss 5 war between siri hanmanth and lobo | TV9  Telugu

కానీ ఈ వారం మాత్రం…లోబో ఇంటి నుండి బయటకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే..ఈ వారం లోబో ఆట తీరు గమనిస్తే ప్రారంభంలో ఉన్నట్టు కాకుండా చాలా సైలెంట్ అయిపోయాడు. పైగా టాస్క్ లో…కూడా పెద్దగా పెర్ఫామెన్స్ చేసిన సందర్భాలు లేవు. చాలావరకు రవి కంట్రోల్ లోకి వెళ్ళిపోయాడు. దీంతో.. తనపై తనకే నమ్మకం లేదు అన్న తరహాలో..లోబో ఆట తీరు ఉంది. లోబో తో పాటు .. ఇంటి నుండి బయటకు వెళ్ళటానికి డేంజర్ జోన్ లో ఉన్న మరో కంటెస్టెంట్…జెస్సీ. ఐదవ వారంలో హౌస్ లో ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా హౌస్ లో డిస్కషన్లు పరంగా అయిన జెస్సీ.. తనదైన శైలిలో గేమ్ ఆడాడు. “రాజ్యానికి ఒక్కడే రాజు” అనే టాస్క్ లో.. ఏకంగా శ్రీ రామ్ చంద్ర నీ… గట్టిగా డిఫెండ్ చేయడం జరిగింది.

Bigg Boss Telugu 5: Jaswanth aka Jessie voted as the worst performer |  Bollywood Bubble

వైల్డ్ కార్డ్ రూపంలో మరో ఇద్దరికి ఛాన్స్

సో లోబో…జెస్సీ ఈ ఇద్దరు ఆట తీరు బట్టి చూస్తే…జెస్సీ సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు.. కచ్చితంగా మనోడు సేఫ్ అవటం గ్యారెంటీ అని ఆడియన్స్  అంచనా వేస్తున్నారు. లోబో ప్రారంభంలో చేసిన ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ ఇప్పుడు లేకపోవడంతో… ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని బయట జనాల టాక్. ఇదిలా ఉంటే తొలి మూడు వారాలు ఇంటి నుండి అమ్మాయిలు ఎక్కువ ఎలిమినేట్ కాగా తర్వాత వారం నుండి అబ్బాయిలు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఏర్పడటం గమనార్హం. ఇదిలా ఉంటే మరోపక్క ఈ ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఇద్దరిని బయటకు పంపించి వైల్డ్ కార్డ్ రూపంలో మరో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు.. సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

Bigg Boss Telugu Season 5 promo out. Watch video - Television News

ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా.. జరలేదు

ఎందుకంటే ప్రస్తుతం హౌస్లో గ్రూప్ రాజకీయాలు తప్ప ఎంటర్టైన్మెంట్ పరంగా.. అందాలు కనువిందు చేసే ఈ విషయంలో కూడా హౌస్ లో పెద్దగా కంటెంట్ కలిగిన కంటెస్టెంట్ ఎవరు లేరని బయట టాక్. దీంతోపాటు టిఆర్పి రేటింగులు కూడా తగ్గిపోతున్న ట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో హౌస్ లోకి… ఇద్దరు టాప్ యాంకర్లను పంపించే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు.. మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా షో ప్రారంభం అయ్యాక ఇప్పటి వరకు.. ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా.. జరగలేదు. ఈ నేపథ్యంలో లోబో, జెస్సీ లని.. ఒకేసారి ఎలిమినేట్ చేసి డబల్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు లేటెస్ట్ టాక్.


Share

Related posts

YS Sharmila : కేసీఆర్ కు అదిరిపోయే షాకులు రెడీ చేస్తున్న ష‌ర్మిల‌

sridhar

Visakha Steel Plant: ఏవడురా అమ్మేది ..! ఎవడురా కొనేది..! ఎయిర్ పోర్టులోనే అడ్డుకుంటామంటూ స్టీల్ ప్లాంట్ కార్మికుల హెచ్చరిక..!!

somaraju sharma

పంది మాంసం చాలా టేస్టీగా ఉందంటున్న రష్మిక!

Teja