Nagarjuna: గత కొన్ని రోజులుగా అక్కినేని నాగార్జున చేస్తున్న సినిమాలు అభిమానులను మెప్పించలేకపోతున్నాయి. గత ఏడాది నాగార్జున యాక్ట్ చేసిన వైల్డ్ డాగ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాగార్జున అసలు వయసు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాలేదు కాబట్టి దీనికి ఇది హిట్ అని పరిగణించలేము. ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి హిట్ అయింది. కానీ ఆ హిట్‌ని నాగచైతన్య ఖాతాలో వేసుకున్నారు. సో, బంగార్రాజు సినిమా వల్ల నాగార్జున కెరీర్‌కి ప్లస్ అయింది ఏమీ లేదు.
Nagarjuna: అది కూడా నిరాశనే మిగిల్చింది
దాని తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ఘోస్ట్ మూవీలో నటించాడు నాగ్. ఆ మూవీ కూడా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకి మొదటి మూడు రోజులు కలెక్షన్స్ అంతంత మాత్రం గానే వచ్చాయి. ఈ వీకెండ్ దాటిదే ది గోస్ట్ కలెక్షన్స్ పూర్తిగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా ప్లాప్ అవడం తో నాగార్జున బాగా డిసపాయింట్ అయినట్లు తెలుస్తుంది.
రిక్వెస్ట్ అదే
నాగార్జున వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో సినీ అభిమానులు నిరాశ పెడుతున్నారు. ముఖ్యంగా అతని అభిమానులు. అక్కినేని ఫ్యాన్స్‌కి నాగార్జున ప్రతిసారీ డిసప్పాయింట్ తప్ప హ్యాపీనెస్ అస్సలు ఇవ్వలేకపొతున్నాడు. దీంతో కొందరు ఫ్యాన్స్ నాగార్జునకి ఒక సలహా ఇస్తున్నారు. కొద్ది రోజులు సినిమాలకి దూరంగా ఉండమని.. మంచి స్క్రిప్ట్ జరిగిన తర్వాతే సినిమా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ టాలీవుడ్ మన్మథుడు ఘోస్ట్ సినిమా తరువాత 6 నెలలు గ్యాప్ తీసుకుంటానని చెప్పాడు. మళ్లీ మంచి స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తానని.. అది ఓటీటీ కంటెంట్ అయిన తనకు ఓకే అని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే “వద్దు, బాబోయ్! మీరు పొలోమని వరుసగా సినిమాలు తీయద్దంటూ” అక్కినేని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడం ఇతరులకు వింతగా అనిపిస్తోంది.