Bigg Boss 5 Telugu: ప్రియ ఆంటీ కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆరో వారం చివరి దశకు చేరుకుంది. ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ కావడంతో.. మరి కొద్ది గంటల్లో నాగార్జున హౌస్ సభ్యులతో వ్యవహరించిన తీరు ప్రసారం కానుంది. ఇదిలాఉంటే ఎప్పటి లాగానే హౌస్ లో జరిగే విశేషాలు లీక్ వార్తల పుణ్యమా బయటకు వచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి బయటకు వచ్చిన వార్తల ప్రకారం ప్రియ ఆంటీ కి నాగార్జున వార్నింగ్ ఇవ్వటం జరిగిందట. ప్రియ ఆంటీ హౌస్ లో ఐదో వారం కెప్టెన్ గా ఎన్నికవడం తెలిసిందే. ఈ తరుణంలో చాలా మందితో ప్రియా ఆంటి గొడవలు పెట్టుకోవడం జరిగింది. ఇంటి సభ్యులతో ఇష్టానుసారంగా.. వ్యవహరిస్తూ నోరు జారుతూ.. ప్రతి చిన్నదానికి వాగ్వాదానికి దిగుతూ రాణిస్తున్న ప్రియ ఆంటీ “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో… సంచాలకులుగా వ్యవహరించిన సిరి, కాజల్ లపై.. ప్రియ ఆంటీ గొడవకు దిగిన సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu Season 5: E17: Slut-Shaming Followed by an Apology!

గురువారం జరిగిన ఎపిసోడ్ లో… రూల్స్ మాట్లాడే సమయంలో.. ప్రియ ఆంటీ.. కొత్త కొత్త రూల్స్ ఏరోజుకారోజు పెడితే బాగుండదు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే ఊరుకునే ప్రసక్తి లేదు అన్న తరహాలో మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో సంచాలకులు బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల మేరకే.. మేము రూల్స్ పెడుతున్నాం. అంటూ సంచాలకులు ప్రియ ఆంటీ కి బదులు ఇచ్చారు. ఈ క్రమంలో అంత మందిని ముందుండాలని దూది వచ్చే టైం లో.. సంచాలకులు సరికొత్త ఆదేశాలు ఇవ్వగా… ఇదేంటి ఏం పీకుతున్నారు మీరు అన్న తరహాలో ప్రియ ఆంటీ.. దారుణమైన డైలాగులు వేయడం జరిగింది. ఈ సందర్భాన్ని శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ప్రస్తావించడం జరిగిందట. తోటి ఆడవాళ్ళ తో మాట్లాడే విధానం ప్రియా గారు అని వార్నింగ్ ఇచ్చాడట.

Nagarjuna Warns Bigg Boss Contestants Against Character Assassination of  Housemates

మాటలు హద్దు దాటాయి…

స్మార్ట్ గేమ్ ప్రతిసారి వర్కవుట్ కాదు బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలు ఉన్నాయి… సరైన మాటతీరు మాట్లాడాలి. ప్రియా గారు మొదటి నుండి హౌస్ లో బానే ఉన్నారు కదా ఈ వారమే ఎందుకు అలా బరెస్ట్ అయ్యారు. టాస్క్ లో భాగంగా…ఇతర ఇంటి సభ్యులతో పోరాడేది బాగానే ఉంది. కానీ ఈ క్రమంలో మీ మాటలు హద్దులు దాటుతున్నాయి. సంచాలకులుగా వ్యవహరిస్తున్న వారిపై నువ్వు మాట్లాడే మాటలు హద్దు దాటాయి అని అనిపించలేదా..?? దానికి ప్రియ ఆంటీ లేదు సార్ అని.. బదులిచ్చింది. ఆ సమాధానానికి మరింత చిర్రెత్తిన నాగార్జున.. ఏం పీకుతున్నారు అంటూ అమ్మాయిలకు ఎవరైనా.. ఆ సమాధానం ఇస్తారా.. మాటలు హద్దులు దాటుతున్నయి సరిగ్గా ఉండాలి అన్న తరహాలో ప్రియ ఆంటీ కి… నాగార్జున గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు టాక్.

Unknown Facts About Actress Priya Bigg Boss Senior In 5 Nagarjuna Surprise  Gift Marriage Troubles Divorced 60 Movies Master Movie House -  Telugu-TeluguStop

కెప్టెన్ అయిన తర్వాత మరింతగా… 

మరో పక్క బయట జనాలు కూడా ప్రియా ఆంటీ ఆడుతున్న ఆటతీరు పై రకరకాల డిస్కషన్లు చేసుకుంటున్నా పరిస్థితి ఏర్పడింది. ఇంటిలో అప్పలమ్మ మీటింగులు పెట్టుకుంటూ.. ఒకరి గురించి మరొకరు ప్రియా గారు ఎక్కువ డిస్కషన్లు చేసుకుంటున్నారని.. ఆమె ఆట తీరు పై విమర్శలు చేస్తున్నారు. కెప్టెన్ అయిన తర్వాత మరింతగా రెచ్చిపోయారు…. లహరి పై ఏ విధంగా విమర్శలు అప్పట్లో చేశారో అదే తరహాలో హౌస్ లో ఆమె వ్యవహార శైలి ఉందని.. చెప్పుకొస్తున్నారు. ఈ రీతిగా ఆమె కొనసాగితే.. తొందరగా నీ ఇంటి నుండి ఆమె ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అని విశ్లేషిస్తున్నారు.


Share

Related posts

AP CM YS Jagan: మహమ్మారిపై పోరులో మా వంతు ఇదీ..! సీఎం జగన్‌ను కలిసిన కియా ఎండీ..!!

somaraju sharma

Uddhav Thackeray: బీజేపీతో మళ్లీ శివసేన ‘దోస్తాన్‌’ పై మహా సీఎం ఉద్దవ్ థాకరే స్పందన ఇదీ..!!

somaraju sharma

7th Pay Commission: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా..!!

bharani jella