నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పి ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమా ‘శివ’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించాడు. నాగార్జున సైకిల్ చైన్ తిప్పుతూ రఫ్ ఆడించిన ఆ సీన్ సినిమాలో మొత్తంలో హైలెట్ అయింది. శివ సినిమాలోని ఆ సీన్ నాగార్జున కెరీర్ కి ముందు, కెరీర్ వెనక అని మాట్లాడుకునేలా చేసింది. అంతేకాకుండా ఆ సీన్ ని ఎన్నో సినిమాల్లో కాపీ చేయడం కూడా జరిగింది. మాస్ హీరోగా నాగార్జున నటించిన ఆ సినిమా ఆయన కెరీర్లో టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. శివ సినిమా అక్టోబర్ 5, 1989న రిలీజ్ అయి మంచి విజయాన్ని దకించుకుంది. అయితే ఇప్పుడు ఘోస్ట్ సినిమా కూడా అదే అక్టోబర్ 5న రిలీజ్ చెయ్యాలనే ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు నాగార్జున.
అదే తేదీన ఘోస్ట్ కూడా
గత ఏడాది వైల్డ్ డాగ్ లో నటించిన నాగార్జునకి పెద్దగా పేరు రాకపోయినా, ఈ ఏడాది నటించిన బంగార్రాజు సినిమా మాత్రం మంచి హిట్ సాధించింది. ఆ విజయాన్ని తన వారసుడు నాగచైతన్యతో షేర్ చేసుకున్నాడు. కొన్ని రోజులుగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదరు చూస్తున్న నాగార్జున ఘోస్ట్ సినిమా మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ఘోస్ట్ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. ప్రవీణ్ సతారు దర్శకత్వం వహించిన ఘోస్ట్ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపిస్తారు.
ఈ సినిమాపై భారీ హైప్
ఇప్పుటి వరకు రిలీజ్ అయిన కొన్ని పోస్టర్స్ సినిమాపై అంచనాలను ఎక్కువగా పెంచుతున్నాయి. నాగార్జున ఫిట్నెస్ విషయంలోనూ, లుక్ విషయంలోనూ చాలా కూల్ గా కనిపిస్తాడు. అయితే సెంటిమెంట్‌గా పెట్టుకున్న అక్టోబర్ 5న రిలీజ్ అయ్యే ఘోస్ట్ సినిమా కూడా శివ సినిమాలోని బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.