NewsOrbit
న్యూస్ సినిమా

Naga Shaurya: నాగశౌర్య-అనూషల వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. అనూష బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

Naga Shaurya: ఊహలు గుసగుసలాడే, ఛలో సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నవంబర్ 20న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్​ డిజైనర్ అనూషను ఈ కథనాయకుడు పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే ఈ హీరో ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమైపోయాయి. సోషల్ మీడియాలో వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా వైరల్‌గా మారింది. ఆ ఇన్విటేషన్ ప్రకారం, వీరిద్దరి పెళ్లి వేడుకలు రెండు రోజులు గ్రాండ్‌గా జరగనున్నాయి. నవంబర్ 19, 20 తేదీల్లో బెంగళూరులోని విట్టల్ మాల్యా రోడ్‌లోని జెడబ్ల్యూ మారియట్ హోటల్‌లో పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు.

Naga Shaurya: వెడ్డింగ్ డేట్

Naga Shaurya

నవంబర్ 20న ఉదయం 11.25 గంటలకు నాగశౌర్య-అనూషల వివాహ ముహూర్తాన్ని నిర్ణయించారు. 19న మెహందీ వేడుక జరపనున్నారు. ఇదే రోజున సాయంత్రం 8 గంటల సమయంలో ‘కాక్టెయిల్ నైట్’ పార్టీ నిర్వహిస్తారు. అనూష అసలు పేరు అనూష శెట్టి. నాగశౌర్య ఈమెతో కొంతకాలం క్రితమే పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. పెద్దలు కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహ బంధంతో ఒకటవ్వడానికి సిద్ధమయ్యారు.

వధువు బ్యాక్‌గ్రౌండ్

 

 

View this post on Instagram

 

A post shared by Naga Shaurya (@nagashaurya_universe)

న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్‌లో మెలుకువలు నేర్చుకున్న అనూష ఇప్పుడు ఒక సంస్థను కూడా నడుపుతోంది. ‘అనూష శెట్టి డిజైన్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఒక ప్రైవేట్ ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను ఆమె రన్ చేస్తోంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ & మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తిచేసిన ఆమె 2019, 2020 సంవత్సరాలకు ‘డిజైనర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌’ను గెలుచుకుంది. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ ఎక్సలెన్స్ అవార్డులలో 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ ది కంట్రీ 2020లో కూడా ఆమె చోటు సంపాదించుకుంది. మోస్ట్ క్రియేటివ్ ఇంటీరియర్ డిజైనర్ 2020 ఫర్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అవార్డు కూడా ఆమె సొంతం చేసుకుంది. మీడియా ప్రకారం అనూష ఓ ధనిక బిజినెస్‌మ్యాన్ కూతురు అని తెలుస్తోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri