మగువా చేతి వేళ్ళు అతిశయమే…
మకుటాల్లాన్టి గోళ్ళు అతిశయమే… అంటూ ఆడవారి చేతి వేళ్ళమీద గోళ్ళమీద కూడా కవిత లు రాసారు అంటే వాటికీ అంతటి ప్రత్యేకమైన అందం తో పాటు స్థానం కూడా ఉంది.
నెయిల్ పాలిష్.. అమ్మాయిల గోర్ల కి మరింత అందాన్నిచ్చే ఓ ప్రొడక్ట్. రెండురోజులకు ఒక సారి పాతది తీసేయడం.. కొత్తది వేయడం.. మరి ఇంకా ఎక్కువ మాట్లాడితే.. రోజుకో రంగు కూడా వేసేస్తామంటూ మంచి మంచి కలర్స్ ని తమ పొడవాటి గోళ్ళ పై వేసేస్తూ ఉంటారు. అయితే.. ఈ విషయం లో ఖచ్చితం గా జాగ్రత్త పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నెయిల్ పోలిష్ విషయం లో ఫేమస్ డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చిన విషయమేంటంటే.. ఎక్కువగా నెయిల్ పాలిష్ వాడడం వల్ల బరువు పెరుగుతారని తేలింది. ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం ఉపయోగించి నెయిల్ పాలిష్‌ని తయారు చేస్తారు. ఈ రసాయనం ప్లాస్టిక్, ఫోమ్ ఫర్నీచర్‌కి మంటలు అంటుకోకుండా వాడే రసాయనాన్ని నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు మన్నేందుకు వాడతారు. ఈ రసాయనం వాడడం వల్ల మానవ హార్మోన్స్‌పై ప్రభావం పడుతుంది. తద్వారా.. బరువు పెరుగుతామని తేల్చారు.
ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్ లో దొరికే 3వేల రకాల నెయిల్ చేసిన పరిశోధనల్లో నెయిల్ పాలిష్‌లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ 49శాతం ఉంటుందని తేల్చారు. ఇలాంటి నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, వీటిని వేసుకున్న 10 నుండి 14గంటల్లోపే మనలో టీపీహెచ్‌పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు తెలియచేస్తున్నారు.
అయితే, చర్మానికి అంటుకోకుండా గోళ్లరంగు వేసుకుంటే కొంత పర్వాలేదు కానీ ఆర్టిఫీషియల్ నెయిల్స్ పెట్టుకుని, వాటికీ నెయిల్ పోలిష్ వేసుకోవడం వల్ల మాత్రం ఎలాంటి హాని కలుగదు. ఇక మీదట నెయిల్ పోలిష్ వేసుకునే టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి..