NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

AP Elections 2024: గత కొద్ది రోజులుగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనపర్తి అసెంబ్లీ సిగ్మెంట్ నుండి కూటమి అభ్యర్ధి పోటీ పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీలో చేరక మునుపు అనపర్తి నియోజకవర్గానికి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ ప్రకటించింది. అయితే కూటమిలో బీజేపీ చేరిక తర్వాత సీట్ల సర్దుబాటులో భాగంగా అనపర్తిని బీజేపీ తీసుకుంది. అప్పటికే నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ తరుణంలోనే  రాజమండ్రి లోక్ సభ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి అసెంబ్లీ సిగ్మెంట్ కు మాజీ సైనికుడు, సీనియర్ నాయకుడు శివకృష్ణంరాజును అభ్యర్ధిగా ఆ పార్టీ ప్రకటించింది. అనపర్తిని బీజేపీకి కేటాయించడం పట్ల మాజీ ఎమ్మెల్యే మల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలవాలని ఆయనపై వత్తిడి తెస్తున్నారు. తొలుత రామకృష్ణారెడ్డిని టీడీపీ అధిష్టానం నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుని ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు.

అయితే నల్లమిల్లి టీడీపీ రెబల్ గా పోటీ చేస్తే ఆ ప్రభావం రాజమండ్రి లోక్ సభ స్థానంపై పడుతుందని ఎంపీ అభ్యర్ధి పురందేశ్వరి భావించారు. తనకే టికెట్ కేటాయించాలని రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో గత కొద్ది రోజులుగా ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లా దెందులూరు సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ మాత్రం అనపర్తి సీటు విషయంలో పట్టుదలగా ఉండటంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డినే బీజేపీ లో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ డిసైడ్ అయ్యింది. అయితే .. నల్లమిల్లి అందుకు అంగీకరించలేదు.

ఈ సిగ్మెంట్ ను వెనక్కు ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ ఒప్పుకోకపోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డినే బీజేపీలో చేర్చుకుని అభ్యర్ధిగా దింపాలని పురందేశ్వరి ప్లాన్ చేశారు. దీనిపై పార్టీ అధిష్టానాన్ని ఒప్పించారు. ఇదే క్రమంలో నల్లమిల్లితో సంప్రదింపులు జరపగా, బీజేపీలో చేరేందుకు ఆయన తొలుత  సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తా.. లేకుంటే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. దీంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. నేరుగా రామకృష్ణారెడ్డితో మాట్లాడారు. ఆ వెంటనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నల్లమిల్లి ఇంటికి పంపించారు.

మరో వైపు బుచ్చయ్యతో నారా లోకేష్ కూడా మాట్లాడారు. దీంతో బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలు కలిసి రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో చర్చలు జరిపారు. బీజేపీ నుండి పోటీ చేయాలని సూచించారు. ఇలా చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలు మాట్లాడటంతో బీజేపీ నుండి పోటీ చేసేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృవీకరించారు.

రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్ధిగా అనపర్తి నుండి పోటీ చేయనున్నారని తెలిపారు. టీడీపీని వీడుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నా.. పొత్తులో కూటమి అభ్యర్ధిగానే రామకృష్ణారెడ్డి ఉంటారని బుచ్చయ్య చౌదరి చెప్పారు. నేడో, రేపో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరనున్నారు. అనంతరం బీజేపీ బీఫామ్ తీసుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా అనపర్తి సిగ్మెంట్ పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లు అయ్యింది.

YS Sharmila: జగన్ ఇచ్చిన అప్పుపై షర్మిల ఇచ్చిన క్లారిటీ ఇది

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?