Namitha: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసి బిజీ హీరోయిన్ గా మాత్రమే కాక హాట్ హీరోయిన్ గుర్తింపు దక్కించుకుంది నమిత. ఆ తర్వాత వరుస పరాజయాలు రావడంతో తమిళంలో సినిమాలు చేస్తూ.. అక్కడ తన సత్తా చాటుకుంది. ఊహించని రీతిలో తమిళంలో అభిమానులను సొంతం చేసుకున్న నమిత.. భారీగా క్రేజ్ సొంతం చేసుకోవటం జరిగింది.
ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బిల్లా, సింహా వంటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నమిత తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. ఇదిలాఉంటే ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో.. ప్రముఖ పార్టీకి ప్రచార రథసారథి గా ఉండి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఒకపక్క సినిమారంగంలో మరోపక్క రాజకీయరంగంలో నమిత రాణిస్తూ.. కొద్ది నెలల క్రితం ఓటిటి ఛానల్ తన పేరిట పెట్టడం జరిగింది.
Read more: బిల్లా హీరోయిన్ ఈజ్ బ్యాక్.. డ్యాన్స్ తో చింపేసిందిపో.. వీడియో
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా తన పేరిట ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి షురూ అయింది. దీంతో ఒకపక్క ఓటీటీ పనులు మరోపక్క సినీ నిర్మాణ పనులు చూసుకుంటూ బిజీగా ఉంది. నమితా ఫిలిం ఫ్యాక్టరీ అనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్లు తెలిపిన నమిత మొదటి సినిమా పనులు స్టార్ట్ చేసినట్లు తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముందుగా వైభవం ఏ సినిమా తయారు చేస్తున్నట్లు ఈసినిమాలో తానే లీడ్ రోల్.. ఆ తర్వాత కుక్క నటిస్తున్నట్లు నమిత పేర్కొంది. తాను జంతు ప్రేమికురాలిని కాబట్టి ముందుగానే కుక్క తో సినిమా చేసినట్లు ఐదారు భాషల్లో ఈ బౌ భౌ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తెలుగులో పాటు తమిళంలో కూడా మళ్లీ అవకాశాలు స్టార్ట్ అయినట్లు త్వరలోనే ఒక తెలుగు అదే విధంగా తమిళంలో ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు నమిత పేర్కొంది.