Nandamuri Balakrishna: పాకిస్థాన్‌లో అఖండ..!!

Share

Nandamuri Balakrishna: బాలయ్య బోయపాటిల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మువీ అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సినిమా రూ.54 కోట్ల టార్గెట్ కి మొత్తం మీద రూ.18.70 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ సంక్రాంతి సంబరాలు పేరుతో సక్సెస్ మీట్ నిర్వహిస్తుండగా.. ఈ వేదికపై అఖండ సక్సెస్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ ముందుగా ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అఖండ సినిమా గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోందని అని పేర్కొన్న బాలయ్య.. ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా అని అన్నారు. పాకిస్తాన్ లోనూ అఖండ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారనీ తనకు ఎవరో వాట్సాప్ చేశారని బాలయ్య ఈ సందర్భంగా అన్నారు. ఇదే క్రమంలో పెద్ద సినిమా, చిన్న సినిమా, ఏపిలో సినిమా టికెట్ల అంశంపైనా మాట్లాడారు.

Nandamuri Balakrishna comments on akhanda
Nandamuri Balakrishna comments on akhanda

Nandamuri Balakrishna: చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేేదు

ఇండస్ట్రీ లో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేదని అన్నారు బాలయ్య. పెద్ద సినిమా ప్లాప్ అయితే చిన్న సినిమా అవుతుంది. అలాగే చిన్న సినిమా హిట్ అయితే పెద్ద సినిమా అవుతుందని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని బాలయ్య ఆక్షాంక్షించారు. సినిమా టికెట్ల ధరలపై ఏపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీపై అధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారనీ, కాబట్టి ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు బాలయ్య. అఖండ గ్రాండ్ సక్సెస్ పట్ల చిత్ర యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.


Share

Related posts

‘గులాబీ ఎమ్మెల్యే’ గుండాయిజం! మానవ హక్కుల సంఘానికి మహిళ మొర

Yandamuri

Chiranjeevi: చిరంజీవి సినిమాలో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్..!

Muraliak

అమరావతి వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన

somaraju sharma