Nandamuri Family Fire on YCP: వైసీపీ నేతలపై భగ్గుమన్న నందమూరి ఫ్యామిలీ..! ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు..!!

Share

Nandamuri Family Fire on YCP: టీడీపీ అధినేత, ఏపి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబ సభ్యులు ఘాటుగా స్పందించారు. నందమూరి బాలకృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందమూరి కుటుంబ సభ్యులు వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొంపలో ఉన్నామో అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదన్నారు బాలకృష్ణ. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధికి బదులు, వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని మండిపడ్డారు. అందరి కుటుంబాల్లో మహిళలు ఉన్నారనీ, హేళన చేయవద్దని హితవు పలికారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని అన్నారు. వ్యవస్థలు అన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆడవాళ్ల జోలికిస్తే చేతులు ముడుచుకోవడం సరికాదన్నారు. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. వారు మారకపోతే మెడలు వంచి మారుస్తామన్నారు. మరో సారి నీచమైన పదాలు వాడితే భరతం పడతామని బాలకృష్ణ హెచ్చరించారు.

Nandamuri Family Fire on YCP
Nandamuri Family Fire on YCP

Nandamuri Family Fire on YCP: వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి

దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏమిటని నందమూరి లోకేశ్వరి అన్నారు. వైసీీపీ నేతలు అహాంకారం వీడాలన్నారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలి కానీ కుటుంబ విషయాలజోలికి తీసుకురావడం మంచి పద్దతి కాదని నందమూరి సుహాసిని అన్నారు. మహిళలను ఎన్టీఆర్ ఎంతో గౌరవమిచ్చారనీ, నిన్న అసెంబ్లీ లో జరిగిన ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపు నిచ్చారు. తమ కుటుంబం జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టమని నందమూరి రామకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తే బాధేస్తుందన్నారు. రెండుమూడేళ్లుగా చూస్తున్నాం, చాలా బాధ ఉందని అన్నారు. ద్వారంపూడి, కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని రామకృష్ణ హెచ్చరించారు. వ్యక్తిగత విషయాల జోలికి రావద్దని ఆయన హెచ్చరించారు. సీతమ్మను చెరబట్టిన రావణాసురుడి చరిత్ర ఏమైందో అందరికీ తెలుసనీ, అదే గతి వారికి పడుతుందన్నారు. సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. మీరు హద్దు మీరారు. మేమూ హద్దు మీరతామని రామకృష్ణ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో నందమూరి ఇతర కుటుంబ సభ్యులు గారపాటి శ్రీనివాస్, చైతన్య కృష్ణ తదితరులు మాట్లాడారు.


Share

Related posts

SPB: మరణం తర్వాత పద్మ అవార్డుకు ఎంపికైన ఎస్పీబీ.. 

Ram

బ్రేకింగ్: కీసర ఎమ్మార్వో నాగరాజు లంచంలో కేసులో కొత్త ట్విస్ట్! రేవంత్ రెడ్డి హస్తం!!

Vihari

Pawan Kalyan: పవన్ కు ఇప్పుడు కేసీఆరే మార్గదర్శి..! ఫాలో అవుతారా.. మరి?

Muraliak