NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: నందమూరి సుహాసినికి పార్టీలో కీలక పదవి.. ఆ పుకార్లకు చెక్

Share

TDP: నందమూరి సుహాసినికి టీడీపీలో కీలక పదవి లభించింది. తెలంగాణలోనూ టీడీపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తొంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రణాళికలు సిద్దం చేశారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా ముగ్గురికి చోటు కల్పించారు.

Nandamuri Suhasini

 

రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని (కూకట్ పల్లి నియోజకవర్గం), రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ నాయుడు (కొల్లాపూర్ నియోజకవర్గం), రాష్ట్ర కార్యదర్శిగా బీ విఠల్ (బాన్సువాడ నియోజకవర్గం)ను నియమించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా షకీలా రెడ్డి (ఖైరతాబాద్), జహీంరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా కరాటే రమేష్ ను నియమించారు. ఈ మేరకు కాని జ్ఞానేశ్వర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

నందమూరి సుహాసిని ఏపి రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. గుడివాడ, గన్నవరం లేదా మరేదైనా నియోజకవర్గం నుండి సుహాసిని రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే ..సుహాసినికి తెలంగాణ రాష్ట్ర కమిటీలో పదవి లభించడంతో ఆమె ఏపికి వస్తారనే వస్తున్న పుకార్లకు తెరపడినట్లు అయ్యింది.

YS Viveka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం .. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు


Share

Related posts

కూతురిలా చూసుకోవాల్సిన కోడలి పైనే కన్నేశాడు..! చివరికి….

arun kanna

Bigg Boss 5 Telugu: ఈవారం ఈ ఇద్దరు కంటెస్టెంట్ లు అవుట్… నాగార్జున సంచలన నిర్ణయం..??

sekhar

దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకోండి!!

Kumar