టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వతహాగా పైకి వచ్చిన స్టార్ హీరోలలో ఒకరు న్యాచురల్ స్టార్ నాని. “అష్టా చమ్మా” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని అంచెలంచెలుగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న రీతిలో తన మార్కెట్ క్రియేట్ చేసుకునే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మొన్నటికి మొన్న “జెర్సీ” సినిమాతో అనేక అవార్డులు సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం “టక్ జగదీష్” సినిమాతో ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అవుతున్నారు.
ఇటువంటి నేపథ్యంలో తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాకి సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో నాని పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తన కెరీర్ లో బెల్లంకొండ సురేష్ తో జరిగిన ఒక సంఘటన గురించి బయట పెట్టాడు. తన కెరీర్ స్టార్టింగ్ లో బెల్లంకొండ సురేష్ ఆఫీస్ కి రైడ్ సినిమా చేయకూడదని, అది చెబుదామని వెళ్తే ఆయన బలవంతంగా చేయించారు.
సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నా కెరియర్ కి ఎంతగానో ఉపయోగపడింది అంటూ అప్పటి సంఘటన తాజాగా బయటపెట్టాడు నాని. అంతేకాకుండా అల్లుడు అదుర్స్ సినిమా హిట్ అయి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మంచి కెరియర్ ఉండాలని ఆశిస్తున్నట్టు నాని సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?