Tuck jagadeesh: టక్ జగదీష్ విషయంలో నలిగిపోతున్న నాని.. అందుకే ఈ ఓపెన్ లెటర్ రాశాడా..?

Share

Tuck jagadeesh: నేచురల్ స్టార్ నాని ఇంకా వి సినిమా ఎఫెక్ట్ నుంచి బయటకి రాలేదు. ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది అని అందరూ ఆ సమయంలో చెప్పుకున్నారు. కానీ కరోనా కారణంగా తప్పని పరిస్థితుల్లో వి సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. నిర్మాత దిల్ రాజుకి లాభం వచ్చిందని ప్రచారం జరిగినప్పటికి వాస్తవంగా మాత్రం అంత సీన్ లేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు నాని కి ఈ సినిమా ఓటీటీ అనుభవంగా ఇంకా మర్చిపోలేదు. అందుకే ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘టక్ జగదీశ్’ ను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు ఆ మధ్య తెలిపాడు.

nani is facing trouble with tuck-jagadeesh
nani is facing trouble with tuck-jagadeesh

కానీ తాజాగా నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరి సినిమాను వచ్చే నెల 10న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. అది కూడా థియేటర్స్‌లోనే. దాంతో నాని సినిమా గురించి ఆయన ఓపెన్ లెటర్ రాశాడు. టక్ జగదీష్ సినిమా మీద తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోయాడు నాని. నేను మరోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడినట్టు అయ్యింది..అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు నాని.

Tuck jagadeesh: ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే నాకు చాలా ఇష్టమని అన్న నాని

ఓ సినీ అభిమానిగా అభిమానులతో, ప్రేక్షకులందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే నాకు చాలా ఇష్టమని అన్న నాని, ‘టక్ జగదీశ్’ సినిమాని కూడా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే నిర్మించామని తెలిపాడు. అయితే కరోనా పేండమిక్ పరిస్థితుల కారణంగా, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలీసిందే. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇంకా థియేటర్లు పూర్తిగా తెరుచుకోలేదు. నిర్మాతలకు ఉన్న ఇబ్బందులను దృష్ఠిలో పెట్టుకొని టక్ జగదీష్ రిలీజ్ పై నిర్ణయాన్ని వారికే వదిలేశానని క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ నిర్మాతలు మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం ముందుగా ఆనందించేది నేనే అంటూ, నాని ఈ లేఖలో తెలిపాడు. మొత్తానికి నాని టక్ జగదీష్ సినిమా విషయంలో బాగానే నలిగిపోతున్నట్టు అర్థమవుతోంది.


Share

Related posts

సర్కారు వారి పాట ప్రీ బిజినెస్ డిటేయిల్స్.. మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకోవచ్చు..!

GRK

Mamata benerji: ఇటు మోడీ అటు సోనియాతో మీటింగ్… మ‌మ‌తా ఏం సందేశం ఇస్తున్నారు?

sridhar

Big Breaking: తెలంగాణ హైకోర్టులో ఎంపి రఘురామ లంచ్ మోషన్ పిటిషన్..

somaraju sharma