ఓల్డ్ ట్రెండ్ ఫాలో అవుతున్న నాని ..తేడా కొడితే అంతేనా ..?

ప్రస్తుతం నాని ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో నాని టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చిందని సమాచారం. కాగా ఈ సినిమా తర్వాత నాని ట్యాక్సీవాలా ఫేం రాహుల్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటిస్తున్నాడు.

Niharika Entertainment to produce Nani's Shyam Singha Roy

ఈ సినిమా లో ఇప్పటికే సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా ఎంపికైన సంగతి తెలిసందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కి స్థానం ఉందని ప్రచారం అవుతోంది. అంతేకాదు ఆ హీరోయిన్ ని ఇప్పుడు మేకర్స్ ఎంచుకునే పనిలో ఉన్నారట. దాదాపు అధితి రావు హైదరి ఫైనల్ అయిందని సమాచారం. రీసెంట్ గా నాని నటించిన వి సినిమాలో నాని కి జంటగా అధితి రావు హైదరి నటించిన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ఎంచుకున్నారట.

Nani, Nazriya in Vivek Athreya's 'Ante Sundaraniki' - The Hindu

ట్యాక్సీవాలా సినిమాను విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిచి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రాహుల్ శ్యామ్ సింగ రాయ్ లో అంతకు మించి కొత్త తరహా కాసెప్ట్ తో రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత నాని అంటే సుందరానికి అన్న విభిన్నమైన టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఇలా ఒక సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అన్న ఫార్ముల ఓల్డ్ సినిమాలో ఉండేది. ఇప్పుడు మళ్ళీ నాని అదే ఫాలో అవుతున్నాడన్న టాక్ ఉంది. మరి ఈ ఫార్ములా తో నాని సక్సస్ అవుతాడా లేదా చూడాలి.