Nani : నాని ఈ పేరు వినగానే మన పక్కింటి కుర్రాడిలా ఫీల్ అవుతుంటారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ సహజసిద్దమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. ప్రతి సినిమాకు తనలోని కొత్తదనాన్ని చూపించేందుకు తాపత్రయ పడుతుంటాడు . నాని నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడతాయి అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది వి చిత్రం తో మంచి హిట్ ని సాధించాడు నాని .
ప్రస్తుతం టక్ జగదీశ్ తో అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహూ గారపాటి పెద్ది ఈ మూవీ ని నిర్మిస్తుండగా శివ నిర్వాణ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. దీనితో టక్ జగదీశ్ పైన భారీ అంచనాలు పెరిగాయి . వీరి కాంబినేషన్ లో మరో హిట్ వస్తుందని ఆడియన్సు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ పనుల్లో అంతా బిజీ బిజీ గా ఉంది. ఈ మూవీ ని త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Nani : తను నెక్స్ట్ నటించబోయే మూవీస్ రెమ్యూనిరేషన్ 15 కోట్లా…?
ఇది ఇలా ఉండగా ఈ మూవీ పూర్తి అయితే శ్యామ్ సింగరాయ్ చిత్రీకరణలో నాని పాల్గొననున్నాడు.అదేవిధంగా అంటే సుందరానికి అనే మూవీ ని కూడా చేస్తున్నాడు . వరుసపెట్టి ఈ ఏడాది మూడు సినిమాలతో నాని ఫుల్ బిజీ గా ఉన్నాడు. అయితే ఇది ఇలా ఉండగా నాని తన రెమ్యూనరేషన్ ని పెంచేసాడన్న వార్తలు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయ్. తాను నెక్స్ట్ నటించబోయే మూవీ లకు 15 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. దీనితో నాని నేచురల్ స్టార్ కాదు కాస్ట్లీ స్టార్ అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. నాని తన చిత్రాలకు ఈ మాత్రం తీసుకోకపోతే ఎలా అంటూ అభిమానులు వాపోతున్నారు .