Nani : నేచురల్ స్టార్ నాని హీరోగా సినిమాలు చేస్తూనే సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్‌ను స్థాపించి ప్రయోగాత్మకమైన సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు నిర్మాణ సంస్థను స్థాపించిన ఏ హీరో కూడా నాని మాదిరిగా ఆలోచించలేదు. అందుకే నాని నుంచి అ..! వంటి సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్ కాకపోయినా కూడా ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి, సినీ విశ్లేషకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది. అయితే నాని సినిమా తర్వాత సినిమా అని కాకుండా కాస్త హాలీవుడ్ స్టైల్ లో ఉండే కథలను ఎంచుకొని నిర్మాణం చేపడుతున్నాడు.
ఇదే క్రమంలో ఇటీవల ‘మీట్‌క్యూట్’ అనే సినిమాను ప్రకటించాడు. షూటింగ్ మొదలైన ఈ సినిమా నాన్ స్టాప్‌గా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో నాని సోదరి దీప్తి ఘంటాను దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. 5 కథల సమ్మేళనంగా మీట్‌క్యూట్ చిత్రం రూపొందుతుండగా..’వాల్ పోస్టర్ సినిమా’పై నిర్మిస్తున్నారు. అదా శర్మ – రోహిణి – వర్ష బొల్లమ్మ – ఆకాంక్ష సింగ్ – రుహాని శర్మ – సునయన – సంచిత పూనచ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సత్య రాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ స్పాట్‌నుంచి కొన్ని ఫొటోస్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nani : నానికి చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు.
ఖచ్చితంగా మరోసారి నాని నిర్మాణంలో అద్భుతమైన సినిమా రాబోతుందని ఇప్పటికే టాక్ మొదలై అంచనాలు బాగా పెరుగుతున్నాయి. తన బ్యానర్ ద్వారా ఇప్పటికే ప్రశాంత్ వర్మ – శైలేష్ కొలను పరిచయం చేశాడు. వారు ఇండస్ట్రీలో బాగా సెటిలయ్యారు. మరి ఇప్పుడు తన సోదరి దీప్తి ఘంటా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి. కాగా నాని హీరో నటించిన టక్ జగదీశ్, శ్యాం సింగ రాయ్ సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. అంటే సుందరానికి ప్రస్తుతం సెట్స్‌పై ఉండగా మరికొన్ని ప్రాజెక్ట్స్‌ని ఫైనల్ చేసి పెట్టుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో నానికి చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. చూడాలి మరి రాబోయే సినిమాలతో హిట్ అందుకుంటాడా లేదా..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?