Nani: గత కొంతకాలంగా నానికి చెప్పుకోదగిన హిట్ దక్కడం లేదు. జర్సీ , నాని గ్యాంగ్ లీడర్, వి, గత చిత్రం టక్ జగదీష్..ఇలా ఏ సినిమా వచ్చినా భారీ అంచనాల మధ్య వస్తుంది గానీ హిట్ మాత్రం నాని అకౌంట్లో చేరడం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే నిన్ను కోరి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ లేదనే చెప్పాలి. జెర్సీ మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ హిట్‌గా మాత్రం అంత సంతృప్తికరమైన సినిమా కాలేదు. అయినా నానికి వరుస అవకాశాలు దక్కుతున్నాయి. చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్ట్సే.
టాక్సీవాలా లాంటి విభిన్నమైన సినిమాను తీసి మంచి కమర్షియల్ హిట్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ సినిమా చేశాడు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. తాజాగా రిలీజైన టీజర్‌తో ఈసారి నాని గట్టి హిట్ కొట్టబోతున్నాడనే నమ్మకాలు కలుగుతున్నాయి.
Nani: నాని గనక సోలోగా దిగి ఉంటే అలాగే మంచి హిట్ దక్కేదేమో.
అయితే అది నాని గనక సోలోగా దిగి ఉంటే అలాగే మంచి హిట్ దక్కేదేమో. కానీ అనూహ్యంగా వరుణ్ తేజ్ తన గని సినిమా రిలీజ్ డేట్‌ను మార్చి నానికి షాకిచ్చాడు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ముందు డిసెంబర్ 3న రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్‌ను డిసెంబర్ 24కు మార్చడం హాట్ టాపిక్ అయింది. ఇదే కాదు ఇప్పుడు పుష్ప రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ సినిమా ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ డిసెంబర్ 17న రిలీజ్ కాబోతుండటంతో ఆరోజు రిలీజ్ కావాల్సిన పుష్ప సినిమాను డిసెంబర్ 24కు మార్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే నాని మళ్ళీ కొత్త డేట్ మార్చుకోవాల్సి వస్తుంది. లేదంటే వసూళ్ళపరంగా ఇబ్బందులే అంటున్నారు.