Shyam singh roy : నేచురల్ స్టార్ నాని హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో. బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారంటీ హీరోగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు. నిర్మాతల హీరోగా నాని డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు ఎప్పుడూ ఆయనతో సినిమా చేసేందుకు రెడీగా ఉంటారు. కాగా ఇప్పటికే ఈ నేచురల్ స్టార్ ‘టక్ జగదీష్’ సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అంతేకాదు తాజాగా ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. అంతేకాదు అలా ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ కంప్లీట్ చేశాడో లేదో ఇలా ‘అంటే.. సుందరానికీ!’ సినిమా సెట్స్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని నాని స్వయంగా తెలియజేశాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ పూర్తి చేశానని ఆ మేకోవర్ ని వదిలేసి ‘అంటే.. సుందరానికీ!’ మేకోవర్‌లోకి వచ్చానని ఓ వీడియో వదిలి తెలిపాడు. ఇక ఈ ఏడాదిలోనే మూడు సినిమాలను రిలీజ్ చేయడానికి నాని పక్కా ప్రణాళికతో ఉన్నాడు. వచ్చే నెలలో టక్ జగదీష్ రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ చూస్తున్నారు.
Shyam singh roy : ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ చేస్తారా లేదా ..?
ఈ సినిమాతో నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరి పోటీగా ఉంది. దాంతో సోలో డేట్ కోసం టక్ జగదీష్ బృందం ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ రెండవ వారం టక్ జగదీష్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టనుండగా, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. విజయదశమి పండుగ సమయంలో ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలున్నాయి. వాటిని తట్టుకొని ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ చేస్తారా లేదా చూడాలి. ఇక డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ‘అంటే.. సుందరానికీ!’ రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.