NewsOrbit
న్యూస్ సినిమా

Nani : నాని టక్ జగదీష్ లో ట్రాక్ మార్చిన దర్శకుడు శివ నిర్వాణ ..!

Nani  : నాని టక్ జగదీష్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ ఈ సినిమాని ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. రీతూ వర్మ – ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే టక్ జగదీష్ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ కి అభిమానుల నుంచి.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కాగా ఈ సినిమాని దర్శకుడు శివ నిర్వాణ కుటుంబం – మూలాలు – అచ్చమైన తెలుగు సంస్కృతి వంటి అంశాలతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

nani-nani-tuck-jagadeesh-track-is-changed-by-director-siva-nirvana
nani-nani-tuck-jagadeesh-track-is-changed-by-director-siva-nirvana

ఇప్పటి వరకు నాని నటిస్తూ వస్తున్న సినిమాలలో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. నాని ని అలాంటి సినిమాలలో చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కాస్త రూటు మార్చి ఏదైనా ప్రయోగం చేస్తే అది కాస్త బెడిసి కొడుతోంది.  ఈ మధ్య వచ్చిన సినిమాలే అందుకు ఉదాహరణ.  ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో వచ్చిన వి సినిమా బాగున్నప్పటికి నాని ని ఆ క్యారెక్టర్ లో ప్రేక్షకులు చూడటానికి ఆసక్తి చూపించలేదు. దాంతో రిజల్ట్ తేడా కొట్టింది.

Nani : ‘ టక్ జగదీష్ ‘ కి శివ నిర్వాణ ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ తరహా కథ..!

అందుకే ఇక నాని కంప్లీట్ గా ఫ్యామిలీ సినిమాలే చేయాలనుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే శివ నిర్వాణ తో టక్ జగదీష్ చేస్తున్నాడట. అయితే శివ నిర్వాణ ఇంతక ముందు నిన్నుకోరీ సినిమా చేశాడు. శివ నిర్వాణ డెబ్యూ సినిమా గా వచ్చిన నిన్నుకోరి.. ఆ తర్వాత వచ్చిన మజిలీ బ్రేకప్ లవ్ స్టోరీస్ గా తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

అయితే టక్ జగదీష్ కి మాత్రం శివ నిర్వాణ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరహా కథని ఎంచుకున్నాడట. మరి ఈ సినిమా నాని కి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత శ్యాం సింగ్ రాయ్, అంటే సుందరానికి అన్న సినిమాలు చేస్తున్నాడు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!