Nani : నాని టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్ను కోరి, మజిలీ చిత్రాలలో వరసగ రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నాని – శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన నిన్నుకోరి సూపర్ హిట్ అవడం.. అలాగే శివ నిర్వాణ సెకండ్ మూవీ మజిలీ సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు టక్ జగదీష్ సినిమా మీద ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా చాలా నమ్మకాలు పెట్టుకున్నారు.
నాని కి కూడా టక్ జగదీష్ సినిమా సూపర్ హిట్ ఇస్తుందని చాలా ధీమాగా ఉన్నాడు. శివ నిర్వాణ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా చూపిస్తాడో ఇప్పటికే నిన్నుకోరి, మజిలీ సినిమాలతో అర్థమైంది. అయితే త్వరలో రాబోతున్న టక్ జగదీష్ సినిమాలో కూడా ఒక ట్రాక్ సినిమాకి హైలెట్ అవుతుందని చిత్ర బృందం ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో అన్నదమ్ముల సెంటిమెంట్ అందరినీ కట్టిపడేస్తుందని… అన్న కోసం తమ్ముడు, తమ్ముడి కోసం అన్న ఎమోషన్ సీన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.
Nani : నాని కెరీర్ లో 26 వ సినిమాగా టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టక్ జగదీష్ సినిమాకి హైలైట్ సీన్స్ ఇవే అని సమాచారం. శివ నిర్వాణ ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలకి భిన్నంగా టక్ జగదీష్ సినిమాని తీసుకు వస్తున్నాడు. ఇక నాని కెరీర్ లో 26 వ సినిమాగా టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగమ్మాయి రీతు వర్మ- ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి- హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది.