Nani : నాని నటించిన వి సినిమా గత ఏడాది కరోనా కారణంగా థియోటర్స్ కోసం ఎదురు చూసి చివరికి సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు. సైకో థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన వి సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. యంగ్ బ్యూటీస్ నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్స్ గా నటించారు. నాని గెటప్.. పర్ఫార్మెన్స్ వి సినిమాకి బాగా ప్లస్ అయ్యాయన్న టాక్ ని తెచ్చుకుంది.
ఈ సినిమాతో నిర్మాత కూడా సేఫ్ గానే బయట పడ్డాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా మంచి వ్యూవర్ షిప్ ని తెచ్చుకుంది. నాని సినిమాలు బాలీవుడ్ లో డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడి జనాలు నాని సినిమాని బాగానే ఆదరిస్తున్నారు. ఇక సుధీర్ బాబుకి ఎటూ బాలీవుడ్ లో క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమా ఇప్పుడు హిందీలో డబ్బింగ్ వెర్షన్ రిలీజవుతోంది. ఇక ఈ సినిమాతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా కూడా రిలీజ్ చేయబోతున్నారు.
Nani : శ్యాం సింగ రాయ్, అంటే సుందరానికి షూటింగ్ దశలో ఉన్నాయి.
కరోనా కారణంగా ఈ సినిమా కూడా గతేడాది ఓటిటిలో విడుదలై మంచి హిట్ అయింది. అలాగే దేశవ్యాప్తంగా ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వారు వి ఆకాశం నీ హద్దురా సినిమాలను ఏప్రిల్ 4న హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. లేడీ స్టార్ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వం వహించగా సూర్యకి జంటగా అపర్ణ బాలమురళి నటించింది. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటించాడు. కాగా నాని నటించిన టక్ జగదీష్ ఈ నెలలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే శ్యాం సింగ రాయ్, అంటే సుందరానికి షూటింగ్ దశలో ఉన్నాయి.