Multistarer movie: అవును, మీరు వింటున్నది నిజమే. అయితే అందులో ఒకరు మన తెలుగు వారైతే మరొకరు తమిళ తంబి. మన తెలుగు వాడు మనకు తెలిసిందే. నేచురల్ స్టార్ నాని. మరొకరు ఎవరంటే మన శివ కార్తికేయ. ఈ మధ్య ఇతగాడు మంచి జోష్ మీద వున్నాడు. ఇటీవల కాలంలో శివ చేసిన సినిమాలు అటు తమిళ్లో ఇటు తెలుగులో కూడా మంచిగా ఆడుతున్నాయి. అందుకే అతగాడికి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. దానిని ఉద్దేశించే ఇక్కడ కూడా మనవాడికి మంచి ఆఫర్లు వచ్చినట్టున్నాయి.
Instagram: ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా చేరిన అప్డేట్ ఇదే.!
విషయమేమిటో చూద్దాం..
ప్రస్తుతం నాని పాన్ ఇండియా మూవీ `శ్యామ్ సింగ రాయ్` విడుదలకు సిద్ధంగా వుంది. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. రాహుల్ సంక్రీత్యన్ దీనికి దర్శకత్వం వహించారు. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమా డైరెక్ట్ చేయబడింది. కోల్ కతా నేపథ్యంలో కథను రూపొందించారు. తాజాగా నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాని చెప్పిన సమాధానం శివ కార్తికేయన్ అభిమానులకు మిక్కిలి ఆనందాన్ని కలిగించింది.
Whatsapp: వాట్సాప్లో తాజా ఫీచర్.. చాలామందికి ఇంకా తెలియనే తెలియదు!
అదేమిటంటే?
ఈ క్రమంలో పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన నాని ఓ మాట అక్కడ చెప్పారు. అదేమిటంటే.. తనకు తమిళ స్ట్రెయిట్ మూవీని చేయాలని ఉందని, దానికి సరైన స్క్రిప్ట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. దానికి అక్కడ విలేఖరులు సంతోషిస్తూ నానికి తమిళ మార్కెట్ ఉందని, తప్పకుండా ఆ అవకాశం వస్తుందని అన్నారు. అలాగే `శ్యామ్ సింగ రాయ్` ఇక్కడ కూడా తప్పకుండా హిట్ అవుతుందని జోస్యం చెప్పారు. ఇక చూడాలి మరి.. ఏమవుతుందో!