టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకొని స్వయంకృషి తో ఎదిగిన హీరో న్యాచురల్ స్టార్ నాని. “అష్టా చమ్మా” సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన నాని వరుస విజయాలు సాధిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే జెర్సీ సినిమా రాకముందు వరకు వరుస ఫ్లాపులు చూసిన నాని.. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన జెర్సీ సినిమాతో మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని అలరించే రీతిలో సినిమా చేయడం జరిగింది.
సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో నిర్మాత దిల్ రాజు కి.. బాగా లాభాలు తెచ్చిపెట్టింది జెర్సీ. అటువంటి ఈ సినిమాని దిల్ రాజు స్వయంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈ సినిమాకి వచ్చింది. తెలుగులో ఉత్తమ చిత్రం గా జెర్సీ నిలిచింది.
అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో నటనకి గాను ఉత్తమ నటుడు అవార్డుని నవీన్ పోలిశెట్టి సొంతం చేసుకున్నాడు. అంత మాత్రమే కాక అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురం లో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి..బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. త్వరలోనే ఈ అవార్డులను అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి రెడీ అవుతుంది.