NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Nara Family: ‘నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రొటెక్షన్ గ్రూప్’ కార్డు..! అలా ప్రింటేసారా..?

nara family personal protection group

Nara Family: నారా ఫ్యామిలీ Nara Family దేశంలో కరోనా పరిస్థితులు అల్లకల్లోలం రేపుతున్నాయి. దాదాపు దేశంలో ప్రతిచోటా లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతున్నాయి. పరమిత సమయం దాటితే ఎవరూ రోడ్లపైకి వచ్చేందుకు వీల్లేదు. కరోనా తీవ్రతకు అటు ఏపీలో కర్ఫ్యూ, ఇటు తెలంగాణలో కూడా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఎవరైనా సరే.. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ పోలీసులు పక్కాగా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. అది కూడా ఒక ఐడీ కార్డును చూడటం ద్వారా..!

nara family personal protection group
nara family personal protection group

రోజూలానే మే 21న శుక్రవారం ఉదయం పది గంటల తర్వాత లాక్ డౌన్ నిబంధనలు మొదలయ్యాయి. అన్నిచోట్లాలానే జూబ్లీహిల్స్ ప్రాంతంలో కూడా పోలీసులు గస్తీలో ఉన్నారు. ఈక్రమంలో రోడ్డు నెంబరు 36, నీరూస్ చౌరస్తాలో ఓ  టూ వీలర్ పై ఒక వ్యక్తి రావడం గమనించి పోలీసులు ఆపారు. పోలీసుల ప్రశ్నలకు ఆ వ్యక్తి జవాబిస్తూ.. తనకు బయటకు వెళ్లేందుకు పర్మిషన్ ఉందని చెప్పి.. తన జేబులో నుంచి ఒక ఐడీ కార్డు తీసి పోలీసులకు చూపాడు. ఆ ఐడీ కార్డును చూసిన పోలీసులకు దానిపై ‘నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రొటెక్షన్ గ్రూప్’ పేరుతో ప్రింటై ఉండటం గమనించారు. దానిపై ‘జాషువా’ అని పేరు ఉంది. ఇది ఎవరిచ్చారు? ఎక్కడిది? అని ప్రశ్నించారు పోలీసులు.

 

చంద్రబాబునాయుడు ఇంట్లో పని చేస్తున్న చాలామంది సిబ్బందికి ఇవే కార్డులు ఉన్నాయని వ్యక్తి సమాధానం ఇచ్చినట్టు సమాచారం. విషయంపై ఆరా తీశారు పోలీసులు. ఈ కార్డుకు ప్రభుత్వ ధ్రువీకరణ లేదు. కేవలం ప్రైవేటుగా ముద్రించిన కార్డుగా పోలీసులు గుర్తించారు. దీంతో లాక్ డౌన్ వేళ నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చిందనకు.. ఆ వ్యక్తికి ఫైన్ వేసి కేసు నమోదు చేశారు. అయితే.. ‘నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రొటెక్షన్ గ్రూపు’ అనే ప్రైవేటు కార్డు ఎవరి పర్సనల్ అయినా కావొచ్చు.. కానీ ఇలా పబ్లిగ్గా, అధికారం ఉన్నట్టుగా చూపడం విడ్డూరమనే చెప్పాలి..!

 

 

 

 

author avatar
Muraliak

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk