చింతమనేనితో లోకేష్ ములాఖత్

ఏలూరు: ఏలూరు జిల్లా జైలులో ఉన్న టిడిపి నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గురువారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. చింతమనేనిని పోలీసులు పలు కేసుల్లో అరెస్టు చేయగా 50 రోజులుగా ఏలూరు జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. లోకేష్‌తో పాటు పలువురు టిడిపి ఎమ్మెల్యేలు, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలు చింతమనేనిని పరామర్శించారు. అనంతరం వీరు చింతమనేని నివాసానికీ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందనీ, అధైర్యపడవద్దనీ భరోసా ఇచ్చినట్లు సమాచారం.

చింతమనేని ప్రభాకర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న లోకేష్