న్యూస్ సినిమా

Narappa: ఓటిటి లో “నారప్ప” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!! 

Share

Narappa: విక్టరీ వెంకటేష్ నటించిన “నారప్ప” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా కాలం అయింది. అయితే మహమ్మారి కరోనా వైరస్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనల మేరకు సినిమా థియేటర్లు..క్లోజ్ అవ్వడంతో..పాటు.. జనాలలో వైరస్ భయం ఉండటంతో థియేటర్లకు వచ్చే పరిస్థితి చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తూ ఉండటంతో.. థియేటర్లో కాకుండా చాలా వరకు సినిమాలు ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉంటే “నారప్ప” సినిమా సినిమా ధియేటర్ లో.. రిలీజ్ అవుతుందా లేదా ఓటిటీలో రిలీజ్ అవుతుందా..? అన్న సందేహాలు ఉన్న క్రమంలో.. తాజాగా ఈ సినిమా యూనిట్ జూలై 20వ తారీకు.. ఓటిటి ప్లాట్ ఫామ్.. అమెజాన్ ప్రైమ్ వీడియో లో మూవీ స్ట్రీమింగ్ లో విడుదలవుతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. అంతేకాకుండా పోస్టర్ తో కూడిన ప్రకటన కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాకోసం విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఓటిటి లో సినిమా రిలీజ్ అవుతున్నట్లు.. ప్రకటన చేయడంతో.. ఫ్యాన్స్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Read More: Narappa: నారప్ప సినిమా వాయిదా..

ముందుగా ఈ సినిమా తమిళంలో ధనుష్ హీరోగా ‘అసురన్’ అనే టైటిల్ తో తెరకెక్కటం జరిగింది. ఈ సినిమాని తెలుగులో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఆధ్వర్యంలో సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించగా రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ మ్యూజిక్ అందించడం జరిగింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ‘చలాకీ చిన్నమ్మి’ సాంగ్ కి మంచి ఆదరణ లభించింది. వెంకటేష్ కెరీర్లో 74వ సినిమాగా ‘నారప్ప’  తెరకెక్కడం జరిగింది. 


Share

Related posts

కేబుల్ రంగాన్ని కాపాడాలి

sarath

కిచెన్ క్లీనింగ్ ఇలా చేసుకోండి!!

Kumar

RGV: అరియానా, అషూలకు ఆర్జీవీ షాక్‌.. బిగ్‌బాస్‌లో ఈసారి స‌పోర్ట్ ఆ వ్య‌క్తికే!

kavya N