న్యూస్ సినిమా

కీలక నిర్ణయం తీసుకున్న నరేష్, పవిత్ర.. ఇక రమ్య పరిస్థితి ఏంటంటే?

Share

సినీ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రను నరేష్ పెళ్లి చేసుకున్నాడని నరేష్ మూడో భార్య రమ్య (Ramya) ఆరోపించడం కూడా పెద్ద సంచలనం అయింది. ఆ తర్వాత నరేష్ మీడియాకి ముందుకు వచ్చి కౌంటర్ స్టేట్‌మెంట్‌లు ఇచ్చాడు. తన భార్య రమ్య రఘుపతి తనతో అసలు కలిసి ఉండదని… ఆమె ఎవరితోనో ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. తనకు పవిత్ర మంచి స్నేహితురాలని.. అంతకు మించి తమ మధ్య ఏం లేదని చెప్పాడు. పవిత్ర కూడా కొన్ని కామెంట్స్ చేసింది. రమ్య అనవసరంగా తనను టార్గెట్ చేసిందని, తానేం తప్పు చేయలేదని, తనకేం తెలియదని పవిత్ర ఒక వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. ఇలా వీరంతా మాట్లాడుతూ ఎప్పుడూ న్యూస్‌లో నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు నరేష్, పవిత్ర కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 ఇకపై వాటికి దూరం

ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే అందరూ తమ గురించి పట్టించుకోవడం మానేస్తారని నరేష్, పవిత్ర ఇటీవల ఓ నిర్ణయానికి వచ్చారట. మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం గానీ ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ చేయకూడదని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీడియాకి దూరంగా ఉండాలని సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు కోరడంతో.. నరేష్, పవిత్ర కూడా ఇకపై మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు టాక్ నడుస్తోంది. దాంతో పవిత్ర, నరేష్ తమ డ్రామాని ఇకపై మరింత పొడిగించరని అర్థమవుతోంది. ఇక రమ్య విషయంలో న్యాయపరంగా చర్యలు తీసుకుంటామే తప్ప బహిరంగంగా మాట్లాడేది లేదని నరేష్ అన్నట్లు సమాచారం.

సినిమాల వివరాలు

నరేష్ ఈ ఏడాదిలో ఇప్పటికే సూపర్ మచి, గని, అంటే సుందరానికి వంటి సినిమాల్లో కీలక పాత్రలో కనిపించాడు. ఇక పవిత్ర లోకేష్ గారి పాట అంటే సుందరానికి సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించింది. ఈమె తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది.


Share

Related posts

Chiranjeevi : మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఆ కింగ్ మేకర్ ..?

GRK

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ నిజంగా బంగారం… లాస్య జీవితం గొప్ప మలుపు తిరిగే లా చేసాడు!!

Naina

AP New Districts: 13 కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ప్రారంభించిన సీఎం జగన్

somaraju sharma