Bigg Boss 5 Telugu: నటరాజ్ మాస్టర్ హౌస్ నుండి ఎలిమినేట్.. వెళ్తూ వెళ్తూ గుంటనక్క ఎవరో చెప్పేశాడు..!!

Share

Bigg Boss 5 Telugu: అందరూ అనుకున్నట్టుగానే నాలుగో వారం బిగ్ బాస్ హౌస్ నుండి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావడం జరిగింది. ఐదో సీజన్ ప్రారంభమైన మొదటి నుండి.. మూడు వారాలు ఇంటి నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళు కేవలం ఆడవాళ్లే. మొదటివారం సరియు, రెండవ వారం ఉమాదేవి, మూడవ వారం లహరి ఎలిమినేట్ కావడంతో ఈసారి నాలుగో వారంలో కూడా చాలామంది లేడీ కంటెస్టెంట్ లు.. ఉన్న తరుణంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్న తరుణంలో నటరాజ్ మాస్టర్ కి తక్కువ ఓట్లు పడటంతో ఆయన ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇదిలా ఉంటే నటరాజు మాస్టర్ ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి.. ప్రధాన కారణాలు గురించి సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Bigg Boss Telugu 5: Natraj Master Eliminated For These Reasons - Sakshi

ప్రారంభంలో చాలా సీరియస్ గా ఆట పై ఫోకస్ పెట్టిన నటరాజ్ మాస్టారు తర్వాత…గేమ్ నీ.. చాలా సందర్భాలలో సీరియస్ గా తీసుకుని అతిగా డైలాగులు రాయడం వల్ల ఆయన గ్రాఫ్ పడిపోయిందని చెప్పుకొస్తున్నారు. టాస్క్ లలో… అదే రీతిలో ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ లో… మోనార్క్ మాదిరిగా మాట్లాడటం.., నేను చెప్పిందే వినాలి నేను మాట్లాడింది కరెక్ట్ అని ధోరణితో ప్రవర్తించడంతో.. ఇంటిలో ఉన్న కంటెస్టెంట్ లతో పాటు బయట జనాలకు కూడా ఆయనపై విసుగు ఏర్పడినట్లు అందువల్లే ఓట్లు తక్కువ వచ్చినట్లు బయట చెప్పుకుంటున్నారు. ప్రతిసారి హౌస్లో నేను సింహాన్ని నాతో వేట పులితో ఆట, నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది.. ఇలా హీరోయిజం డైలాగులు వేయటం తో పాటు మరో పక్క హౌస్ లో ఉండే సభ్యులకు జంతువుల పేర్లు పెట్టడం వల్ల నటరాజ్ మాస్టర్ కి… ప్రేక్షకాదరణ నాలుగో వారంలో తక్కువయిందని అందువల్ల ఎలిమినేట్ అయినట్లు భావిస్తున్నారు.

Bigg Boss 5 Telugu:  ఇతర ఇంటి సభ్యులను టార్గెట్ చేయటం

ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్నంతకాలం నటరాజు మాస్టర్… రవి ని టార్గెట్ చేసి ఆడిన గేమ్ హైలెట్ అని ముఖ్యంగా పరోక్షంగా రవిని గుంటనక్క అనే టైటిల్ పెట్టడం.. ఈ సీజన్ ఫైవ్ కి… హైలెట్ అవుతుందని.. చెప్పుకొస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా పెద్దగా నటరాజ్ మాస్టర్.. అలరించలేకపోయారు, ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న… ఇంటిలో పెద్దగా స్టెప్పులు వేసిన సందర్భాలు కూడా నాలుగు వారాలలో ఏమి కనిపించలేదని.. ఇది కూడా ఆయనకి.. పెద్ద మైనస్. హౌస్ లో ఉండే చాలా మంది సభ్యులు పెద్దగా ఆయనను పట్టించుకోకపోయినా గాని నటరాజ్ మాస్టర్… ఇతర ఇంటి సభ్యులను టార్గెట్ చేయటం వలన.. కూడా దెబ్బ తిన్నారు అని అందువల్లే నాలుగో వారం ఆయన ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు బయట జనాల టాక్. ఈ క్రమంలో హౌస్లో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళుతున్న సమయంలో.. ఇంటిలో సన్నీ అదేరీతిలో పింకీ ఇంకా చాలామంది భావోద్వేగానికి గురయ్యారు.

Bigg Boss 5 Telugu:  బిగ్ బాస్ డోర్లు పగలగొట్టుకుని

నటరాజ్ మాస్టర్ చాలా నిజాయితీగా అదే రీతిలో నిక్కచ్చిగా ఉండటం వల్లే ఆయన చేసిన తప్ప అంటూ పింకీ… బాగా ఎమోషనల్ యాడవ్వటం జరిగింది. లోబో, హమీద, యాని.. అయితే గుక్క పెట్టి మరీ ఏడ్చారు. ఇక ఇదే సమయంలో నటరాజ్ మాస్టర్… కన్నీళ్ళతో హౌస్ మొత్తం చూసుకుని వీడ్కోలు పలికారు. అంత మాత్రమే కాక తన భార్యకి అవసరం ఉండి ఉంటది అందుకే ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు చాలా పాజిటివ్ గా… ఎలిమినేషన్ ని తీసుకున్నారు. వాస్తవానికి ఇంటిలో ఉన్నంతకాలం.. బిగ్ బాస్ డోర్లు పగలగొట్టుకుని బయటకు వెళ్లి పోవాలి అనే.. ఒత్తిడికి అంతర్మథనంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్టేజ్ పై మరింత భావోద్వేగానికి గురైన నటరాజు మాస్టర్ నీ… నాగార్జున మరింతగా ఓదార్చడం జరిగింది. ఈ క్రమంలో హౌస్ నుండి వెళ్తూ ఇంట్లో ఉన్న సభ్యులకి.. జంతువుల ఫోటోలు పెట్టి వాళ్ళకు ఎటువంటి పేరు కేటాయిస్తావు..అనే టాస్క్ నటరాజ్ మాస్టర్ కి.. ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో సిరికి కాటేసే పాము. లోబో కి.. కిచెన్ లో ఎలుక, విశ్వా కి ఊసరవెల్లి, శ్రీరామ్ కి ముసలి, ప్రియాంక సింగ్ కి చిలక, సింహం తానే అని పోల్చుకున్నాడు. ఇక గాడిద లా మానస్ హౌస్ లో చాకిరీ చేస్తాడని చెప్పుకొచ్చారు. గుంటనక్క టైటిల్ విషయంలో రవీని పోలుస్తూ.. మాస్టర్ క్లారిటీ ఇచ్చేయడం జరిగింది.


Share

Related posts

హైకోర్టు+కేంద్రం+ గ‌వ‌ర్న‌ర్‌+ప్ర‌తిప‌క్షాలు…ఎంత మందితో చెప్పించుకుంటావు కేసీఆర్‌?

sridhar

మిలాట్… మీరు మాకొద్దు !! జస్టిస్ కన్నీరు X జగన్ తగ్గరు

Comrade CHE

MAA Elections: ఈ విషయంలో కేసిఆర్ సర్కార్ యమ గ్రేటో..! వాళ్లు థ్యాంక్స్ చెప్పాల్సిందే..!!?

somaraju sharma