Bigg Boss 5 Telugu: అతనిదే బిగ్ బాస్ టైటిల్ అంటున్న నటరాజ్ మాస్టర్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో… 5వ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్. ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక సంపాదించుకున్న నటరాజ్ మాస్టర్ తెలుగు టెలివిజన్ రంగంలో డాన్స్ రియాల్టీ షోలకు.. ఆద్యుడు. అప్పట్లో ఉదయభాను తో కలిసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో… ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. కొరియోగ్రాఫర్ అదేరీతిలో మెంటర్ గా.. కూడా రాణించడం జరిగింది. దాదాపు ఇండస్ట్రీలో 20 ఏళ్లకు పైగా బిజీ కొరియోగ్రాఫర్ గా… టాప్ హీరోలతో పని చేసిన నటరాజు మాస్టర్.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి.. నాలుగు వారాలు అలరించి సరిగా ఐదో వారం స్టార్టింగ్ లో ఎలిమినేట్ కావటం తెలిసిందే.

nataraj: Bigg Boss Telugu 5: Ravi vents his displeasure over Nataraj; here's what netizens think about their 'Puli-Nakka' conflict - Times of India

కాగా హౌస్లో ఉన్నంతకాలం నటరాజ్ మాస్టర్ తనదైన శైలిలో గేమ్ ఆడాడు అని.. బయట జనాల టాక్. మొదటి నుండి ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తూ.. ఎక్కడా దాచుకోకుండా హౌస్ లో ఉన్నంత కాలం రాణించటం జరిగింది. ముఖ్యంగా హౌస్ లో ఇతర ఇంటి సభ్యులను… అనేక విషయాలలో ఎగదోస్తూ చాలా సైలెంట్ అయిపోయి ఫిటింగ్ లు పెట్టె యాంకర్ రవికి గుంటనక్క అనే టైటిల్ పెట్టి ఈ సీజన్ మొత్తానికి నటరాజ్ మాస్టర్ హైలెట్ గా నిలిచారు. జనాలలో యాంకర్ రవి పై ఉండే అభిప్రాయాన్ని చాలావరకు.. డిగ్రేడ్ చేసే తరహాలో మాస్టర్ హౌస్ లో వ్యవహరించారు. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో అదే రీతిలో…టాస్క్ లు ఆడే విషయంలో… తన శక్తి మేర హౌస్ లో రాణించడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా అలరించారు. అయితే ఎక్కువగా చాలావరకు ఇంటిలో ఉన్న సభ్యులకు జంతువుల పేర్లు పెడుతూ… ఉండటంతోపాటు చాదస్తం మాదిరిగా కొన్నిసార్లు.. మాస్టర్ ర్ హౌస్ సభ్యులతో వ్యవహరించటం… ఆయనకు మైనస్ అయింది. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చిన నటరాజ్ మాస్టర్ పలు ప్రముఖ టీవీ ఛానల్ లకి… ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్న నటరాజ్ మాస్టర్ ఈ సారి బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారో తమదైన జోస్యం చెప్పడం జరిగింది.

Big Boss 5 - Manas - Sriram Chandra Fight for teams #bigboss #bigbossfights #manas #sriramchandra - YouTube

వాళ్ళిద్దరిలో ఒకరకి టైటిల్

యాంకర్ ఎవరు ఈసారి సీజన్ ఫైవ్ ట్రోఫీ… అందుకుంటారు అని మీ అభిప్రాయం..అంటూ నటరాజ్ మాస్టర్ ని ప్రశ్నించారు. దానికి మాస్టర్ సమాధానమిస్తూ.. హౌస్ లో ఇద్దరు అనుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. మొదటిగా శ్రీ రామచంద్ర తర్వాత మానస్… వీళ్ళిద్దరిలో ఒకరు టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే మొన్నటి వరకు మానస్ గెలుస్తాడని చాలా అంచనాలు వేశారు కానీ ఇటీవల అతడు కొంతమంది ఆడవాళ్ళ చెప్పుడు మాటలు బాగా వింటున్నాడు, ప్రభావితం అవుతున్నాడు.. కనుక శ్రీ రామచంద్ర ఎక్కువ టైటిల్ విన్నర్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అని నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఇక రవి మిగతా వాళ్ళు చూస్తే పెద్దగా రాణించే పరిస్థితి లేదని అన్నారు. ఇదిలా ఉంటే హౌస్ లో రెండు వారాల తర్వాత ఎలిమినేట్ అవుతారు అని భావించారు కానీ నాలుగు వారాలు ఉండటం చాలా సంతోషంగా ఉంది.

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అతడే అంటున్న నటరాజ్ మాస్టర్..

హౌస్ లో కథ వేరేలా ఉండేది

ఇంకా రెండు వారాలు ఉంటే… హౌస్ లో కథ వేరేలా ఉండేది.. నాలో సరైన క్యాండెట్ బయటకు వచ్చేవాడు.. వాడు గేమ్ స్టార్ట్ చేసేవాడు.. అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేశారు. ఇదిలా ఉంటే బయట కూడా చాలావరకు బిగ్ బాస్ టైటిల్ ట్రోఫీ గెలిచే సత్తా ఉన్న పేర్లు బట్టి చూస్తే శ్రీరామచంద్ర, మానస్ పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. ఇద్దరూ కూడా ఆచితూచి మాట్లాడుతూ సరికొత్త నిర్ణయాలు తెలివిగా తీసుకుంటూ వ్యవహరిస్తున్నారు. టైటిల్ గెలవక పోయినా గాని ఇద్దరు మాత్రం టాప్ ఫైవ్ లో ఉంటారని ఖచ్చితంగా టైటిల్ గెలవటానికి వీరిద్దరూ అర్హులని భావిస్తున్నారు.


Share

Related posts

అటుకుల లడ్డుతో కరోనాకు చెక్.. ఎలా అంటే?

Teja

అమిత్‌షాకు చంద్రబాబు ఫోన్..!ఎందుకంటే..?

Special Bureau

అఖిల ప్రియ ఆలోచన కన్నా వరకూ చేరిందా?

CMR