ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం, విశాఖలో ఎనర్జీ, టెక్ పార్క్ ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాలకు మంత్రివర్గం ఆమోదించింది. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది. వైఎస్ఆర్ కల్యాణ మస్తు పథకంలో గతం కంటే ఎక్కువ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.

ఇవి కేబినెట్ నిర్ణయాలు
- కర్నూలు జిల్లా డోన్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం
- ఈ నెల రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదం
- ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్ ఆమోదం
- 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధుల పోస్టుల భర్తీకి ఆమోదం
- డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటునకు కేబినెట్ ఆమోదం
- విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- నెల్లూరు బ్యారేజ్ ను నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ గా మారుస్తూ నిర్ణయం
- రామాయపట్నం పోర్టులో రెండు క్యాపిటివ్ బెర్త్ ల నిర్మాణానికి ఆమోదం
- పంప్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం
- లీగల్ సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
ఫోన్ ట్యాపింగ్ కాదు .. ఫోన్ రికార్డింగ్‌యే .. కోటంరెడ్డి ఆరోపణ తేలిపాయే..!