Money: ప్రస్తుతం చాలామంది డబ్బును ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టి అధిక రాబడి పొందాలని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే మీకోసం ఒక అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ పథకాన్ని మీ ముందుకు తీసుకువచ్చాము ఈ పథకం ద్వారా మీరు పన్ను మినహాయింపుతో పాటు అధిక వడ్డీ రేటును కూడా పొందుతారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లన్న సవరిస్తోంది కాబట్టి వడ్డీరేట్లలో మార్పులు రావచ్చు కానీ సాధ్యమైనంత వరకు కోత విధించరు.

ఇక పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఆ అద్భుతమైన పథకం నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్.. ఇందులో సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు లభించడంతోపాటు ప్రస్తుతం 7.7 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. ఉదాహరణకు ఇందులో ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ కాలం ఉన్న ఈ పథకంలో 1000 రూపాయలు డిపాజిట్ చేసి వదిలేస్తే ఐదు సంవత్సరాల తర్వాత రూ.1403 లభిస్తుంది అలాగే లక్ష రూపాయలు డిపాజిట్ చేసి వదిలేస్తే ఐదు సంవత్సరాల తర్వాత రూ.1,40,000 రూపాయలను పొందవచ్చు.
ఈ పథకంలో గరిష్ట పరిమితి ఏమీ లేదు కానీ కనిష్టంగా మాత్రం ఖచ్చితంగా వేయి రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ మీరు ఓపెన్ చేయవచ్చు అంతేకాదు మైనర్ పేరు మీద కూడా ఖాతా ఓపెన్ చేసి గార్డియన్ ను సృష్టించాలి. ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పండు మినహాయింపు. మీ పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం భద్రతా భరోసా ఇస్తుంది అయితే ఫిక్స్ డిపాజిట్ లో కేవలం ఐదు లక్షల వరకు మాత్రమే ఆర్బిఐ భద్రత ఇస్తుంది. కానీ ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి కూడా భద్రత లభిస్తుందని చెప్పవచ్చు.