Natural Therapy: మనం ఇంట్లో చేసుకునే కరివేపాకు రసంతో కొలెస్ట్రాల్, షుగర్ ను తగ్గించుకోవచ్చు..! మందులకన్నా బెస్ట్

Share

Natural Therapy: మన దక్షిణ భారతదేశంలో కరివేపాకు ఎంతో చవకగా ఇంట్లోనే పెంచుకుని… రోజూ వాటి ఆకులు కోసుకొని కూరల్లో వాడుతుంటాం. అయితే కేవలం రుచికోసం, ఫ్లేవర్ కోసం వాడే కరివేపాకు వల్ల హృద్రోగ సమస్యలు, రక్తపోటు, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటాయనే విషయం మీకు తెలుసా?

 

Natural Therapy from curry leaf is therapeutic

మన వంటకాల్లో కరివేపాకు అనేది ఎంతో సాధారణంగా వాడుతాము. అదే కాదు ఇతర ఆకులన్నీ మనం తరచూ వాడేవే. అయితే కరివేపాకు మాత్రం పూర్తిగా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అసలు మనం చేసే సాంబార్ రసం లో వేసే కరివేపాకు మంచి వాసన ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియలో ఉండే సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిన సాంబార్ లో కూడా దీని వాడకం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇక భారతదేశం, శ్రీలంకలో పెరిగే ఈ మొక్కలను గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలకు, జుట్టురాలడం తగ్గించేందుకు ఇళ్లల్లోనే ఉపయోగిస్తారు. 

ఎన్నో లాభాలు….

అయితే ఒక వైద్య రీసెర్చ్ లో తెలిసిందేమిటంటే ఈ కరివేపాకు వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గించవచ్చు. దీంట్లో ఉండే ఆల్కలాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్ మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి అని అంతేకాకుండా దీనిలో మనిషి రోగనిరోధక శక్తికి ఎంత ముఖ్యమైనటువంటి యాంటీఆక్సిడెంట్స్ కూడా ఘనంగా ఉంటాయని తెలిపారు. దీని వల్ల మనకు ఎలాంటి సమస్యలు రావని స్పష్టం చేశారు. విటమిన్ ఎ, బి, సి, ఈ, కె ఉండే ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. 

ఎలుకలపై పరిశోధన:

2014లో ఎలుకలపై జరిపిన ఒక స్టడీలో తేలింది ఏమిటంటే ఒక గ్రూపు ఎలుకలకు అవి ఇచ్చినప్పుడు ఆక్సిడెంట్ వాటిలో ఒత్తిడిని చూపించకపోగా… కరివేపాకు ఇవ్వని ఎలుకలకి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వచ్చాయి. అలాగే అధిక కొలెస్ట్రాల్తో బాధపడేవారికి ఈ సమస్యల నుంచి దూరం చేయడంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. అలాగే ఇది తరచుగా తింటుంటే ఒంట్లో కొవ్వు కూడా పేరుకొనిపోయే అవకాశం ఉండదు. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 

Natural Therapy from curry leaf is therapeutic 2

అలాగే టైప్ 2 డయాబెటిస్… అంటే ఒంట్లో షుగర్ ఉన్నవారిని కూడా ఇది కాపాడుతుంది. ఒక 30 రోజుల పరిశోధనలో తెలిసింది ఏమిటంటే డయాబెటిక్ ఇన్న వారికి ఈ కరివేపాకు తినిపిస్తే అది వారిలోని బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గించి వేసింది. ప్రస్తుతం ఉన్న షుగర్ మందులు కంటే కూడా ఈ కరివేపాకు మిశ్రమాన్ని తీసుకుంటే ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు. ఈ కరివేపాకులో క్యాన్సర్ ని నిరోధించే లక్షణాలూ ఉన్నాయి.

ఇక కరివేపాకు రసాన్ని  ఎలా తయారు చేసుకోవాలంటే…

25 కరివేపాకు ఆకులు, ఒక కప్పు నీళ్ళు తీసుకొని ఆకులను బాగా కడగాలి, ఆ తర్వాత ఒక గిన్నెలో ఆ నీటిని వేసి మరిగించి వాటిలో కరివేపాకు ఆకులను వేయాలి. ఐదు నిమిషాల తర్వాత మంట ఆపేసి ఆకులను వేడి నీళ్లలో అలాగే ఉంచాలి. ఎప్పుడైతే నీటి రంగు మారుతుందో… అప్పుడు ఆకులని తీసేసి ఆ వేడివేడి నీటిని తాగండి. మీకు ఇంకా అవసరం అనుకుంటే ఆ నీటిలో కొంచెం నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని పొద్దున్నే ఏమి తినకుండా తాగవచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు.


Share

Related posts

Job update: డబ్యూడీసీడబ్యూ నోటిఫికేషన్..!!

bharani jella

Mahesh Babu : మహేష్, రామ్ చరణ్ మిస్ చేసుకున్నారు వరుణ్ తేజ్ హిట్ అందుకున్నాడు…!!

sekhar

Achennayudu : హోం మినిస్టర్ నేనే అన్న అచ్చెంనాయుడు డైలాగ్ వెనక ఇదా అసలు ప్లాన్?

somaraju sharma