NewsOrbit
న్యూస్

నయా భారత్ ! పీఎం పీఠంపై కన్నేసిన కేసీఆర్ హిట్టా ఫట్టా !

తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్న వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.

naya bharath kcr targets to president seat
naya bharath kcr targets to president seat

తన పార్టీ కి నయా భారత్ అనే పేరును ఇప్పటికే కెసిఆర్  ఖరారు చేశారని.. చురుగ్గా రిజిస్టర్‌ యత్నాలు కూడా సాగుతున్నాయని ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ వార్తను ప్రచురించింది.త్వరలో బిజెపి రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్ష తరహా పాలనను భారత్ పై రుద్దే అవకాశముందని దీన్ని అడ్డుకునేందుకు కెసిఆర్ పావులు కదుపుతున్నారని ఆంధ్రజ్యోతి ఆ కథనంలో పేర్కొంది.జమిలి ఎన్నికల తర్వాత  బిజెపి అధ్యక్ష పాలనకు రంగం సిద్ధం చేసుకుంటోందని.. అదే జరిగితే.. ఇకపై  లోక్‌సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలకే ప్రాముఖ్యం ఉంటుందని.. అసెంబ్లీ ఎన్నికలకే ప్రాంతీయ పార్టీలు పరిమితం అవుతాయని.. ఈ వ్యూహానికి చెక్  పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి నయా భారత్ పార్టీని పెట్టబోతున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.ఈ నేపథ్యంలో జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తే దాన్ని నడపగలిగే సామర్థ్యం కెసిఆర్ కు ఉందా ఆయన కెపాసిటీ సరిపోతుందా అన్న విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

కెసిఆర్ గత చరిత్రను పరిశీలిస్తే ఆయన ఘటనాఘటన సమర్థుడు. టిడిపిలో ఉంటూ మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగి తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి ప్రత్యేక తెలంగాణ సాధించి ఆ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ఘనుడు. పైగా యూపీఏ ప్రభుత్వ హయాంలో కొన్ని రోజులు కేంద్ర మంత్రిగా కూడా కేసీఆర్ పనిచేశారు. చాలా సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. తెలంగాణ సాధించే క్రమంలో ఢిల్లీ లో వివిధ జాతీయ పార్టీల తోటి ఆయన సంబంధాలు నెరిపారు. ఒక దశలో మహాకూటమి అంటూ హడావిడి చేసి అనేక ప్రాంతీయ పార్టీలను ఏకం చేశారు. ఇప్పటికీ ఆయనకు కాంగ్రెస్ బిజెపియేతర పార్టీల అధినేతల తో ప్రత్యక్ష సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

రాజకీయ వ్యూహాలు పన్నడంలో తిరుగులేని నాయకుడు కేసీఆర్.జాతీయ రాజకీయాలకు అవసరమైన హిందీ భాషపై కేసీఆర్ కి అద్భుతమైన పట్టు ఉంది.ఇన్ని ప్లస్పాయింట్ లు ఉన్నందున కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టినా సక్సెస్ కాగలరని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాక ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున జాతీయ పార్టీ నడపడానికి అవసరమైన నిధులకు కూడా కేసీఆర్ కు ఇబ్బంది ఉండదనే చెప్పాలి.బిజెపి దెబ్బకు డీలా పడిన కాంగ్రెస్ కమ్యూనిస్టు తదితర బిజెపి యేతర పార్టీలన్నీ కూడా కెసిఆర్ నయా భారత్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. బిజెపి కూడా కెసిఆర్ ని వేధించడానికి వాళ్ల దగ్గర ఎలాంటి పాయింట్లు లేవు .ఆయనపై కేసులు కూడా లేవు. అందువల్ల కేసీఆర్ ఎవరికీ భయపడాల్సిన పరిస్థితి కూడా లేదు.ఈ కోణాలు అన్నింటిని విశ్లేషిస్తేజాతీయ పార్టీ పెట్టి కూడా కేసీఆర్ సక్సెస్ కాగలరనది రాజకీయ పండితులు అభిప్రాయంగా వినిపిస్తోంది

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!