దక్షిణాది లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నయనతార. నయనతార త్వరలోనే తన ప్రియుడు, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో నయనతార, విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి వార్త కొన్నేళ్ల క్రితం నుండి హల్చల్ చేస్తూనే ఉంది.
కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈసారి మాత్రం వీరిద్దరి కుటుంబ పెద్దలు వీరికి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారట. నయనతార 2015లో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ‘నానుం రౌడీ తాన్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా షూటింగ్ లోనే విఘ్నేశ్ శివన్ మరియు నయనతార ల మధ్య ప్రేమ పుట్టిందట. అప్పటి నుంచే వీరిద్దరూ సహజీవనం సమాచారం.
వీరు లివన్ రిలేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీరి పెళ్లి గురించి ఏదో రకంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 2020 లో వీరి పెళ్లి కచ్చితంగా జరిగిపోతుంది అన్నారు. కానీ కోవిడ్ కారణంగా వీరు తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారట. ఇంతకన్నా ఆలస్యం చేస్తే మంచిది కాదేమో అని భావించిన రెండు కుటుంబాల వారు వీరికి ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట.
క్రిస్టియన్ మరియు హిందూ రెండు పద్ధతులలోనూ విఘ్నేశ్ శివన్, నయనతార పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ వివాహానికి కేవలం స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారట. ప్రస్తుతం విజయ్‌సేతపతి హీరోగా మరియు నయనతార, సమంత హీరోయిన్స్‌గా కాతువాక్కుల్ రెండు కాదల్ సినిమా కు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.