Nayanthara: నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివవ్ని పెళ్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పెళ్లయిన కొద్ది రోజుల తర్వాత ఈ నూతన జంట హనీమూన్ ట్రిప్పుకి వెళ్లిపోయారు. ఈ ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కొత్త పెళ్లికూతురు తన అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది. భర్తతో రొమాంటిక్ గా దిగిన నయనతార ఫొటోలు షేర్ చేసిన వెంటనే వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలలో ఈ జంట రొమాంటిక్ గా కనిపించగా అభిమానులు ఫిదా అయ్యారు.
జవాన్ సినిమా షూటింగ్ లో వెంటనే జాయిన్ అయిపోవాల్సి ఉన్నా నయనతార తన హనీమూన్ ట్రిప్ ని ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయగలిగింది. ఇందుకు కారణం షారుఖ్ అని చెప్పవచ్చు. తన హనీమూన్‌ను హాయిగా ఎంజాయ్ చేయమని నయనతారకు షారుఖ్ ఖాన్ బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ బ్రేక్‌లో ఈ నటి తన హనీమూన్ పూర్తిగా ఆస్వాదించి షారుఖ్ సినిమా షూటింగులో తాజాగా జాయిన్ అయిపోయింది. షారుఖ్ ఖాన్‌తో కలిసి జవాన్ అనే సినిమాలో నయనతార నటించేందుకు కమిట్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఈ లేడీ సూపర్ స్టార్ హనీమూన్ పూర్తి చేయగానే ‘జవాన్’ సినిమా షూటింగ్లో జాయిన్ అయి ఇప్పుడు బిజీ అయిపోయింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది కానీ నయనతార హనీమూన్ ట్రిప్ కోసం షారుఖ్ తన డేట్స్‌ను అడ్జస్ట్ చేశాడు.
జవాన్ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలనుకున్న షారుఖ్ ఖాన్ నయనతార కోసమే కొంచెం బ్రేక్ ఇచ్చాడు. షారుఖ్ ఇదివరకు ఎప్పుడూ ఒక సౌత్ అగ్ర హీరోయిన్‌తో నటించలేదు. మొదటిసారిగా నయనతార లాంటి క్రేజీ హీరోయిన్‌తో నటించబోతున్నాడు. షారుఖ్ ఒక సీనియర్ హీరోయిన్ గా నయనతారకి ఎంతో గౌరవం ఇస్తున్నాడు. షారుక్ ఖాన్ తనకిచ్చిన గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని నయనతార కూడా హనీమూన్ ట్రిప్‌ని ఎంజాయ్ చేసిన వెంటనే షూటింగులో జాయిన్ అయిపోయింది. ఈ కొత్త జంట థాయిలాండ్‌లో హనీమూన్‌ను ఆస్వాదించి తిరిగి ఆదివారం నాడు భారత్‌కు వచ్చేసారు. ప్రస్తుతం నయనతార ముంబైలో జవాన్ షూటింగ్లో బిజీగా ఉంది. జవాన్ సినిమాతో పాటు నయనతార ఇంకొన్ని సినిమాల్లో కనిపించబోతుంది. దానికి సంబంధించి అప్డేట్స్ తెలియాల్సి ఉంది.
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…