Nayanthara Marriage : నయనతార గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ నిత్యం వార్తల్లో వుంటూ ఉంటుంది. బేసిగ్గా ఫేమస్ అయినటువంటి ఆరిస్టుల చుట్టూ కెమెరాలు తిరుగుతూ ఉంటాయి. వారి ప్రతి కదలికా ఒక న్యూస్ అవుతుంది. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. తమిళుల ఆరాధ్య నటి అయినటువంటి నయన్ కి ప్రేమమీద ఎంతో బలమైన నమ్మకముంది. ఈ విషయంలో దాదాపు రెండుసార్లు విఫలం అయినా, ముచ్చటగా మూడోసారి విగ్నేష్ శివన్‌తో పిలల్లోతు ప్రేమలో పడింది. ఇప్పుడు అతన్నే సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Nayanthara Marriage : అసలు విషయం ఇదే:
ఇక అసలు విషయంలోకి వెళితే, నయనతార – విగ్నేష్ శివన్ లవ్ స్టోరీ మొదట సీక్రెట్‌గా నడిచింది. ‘నానూ రౌడీదాన్’ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట చాలాకాలం పాటు రహస్యంగా తమ రిలేషన్ కొనసాగించారు. దీంతో నయనతార- విగ్నేష్ జోడీ ఎక్కడికి వెళ్లినా అదో పెద్ద న్యూస్ కావడం, అందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ కావడం జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఇలాంటి విషయమే మరలా జరిగింది. ఇక లాక్డౌన్లో వీరు నిశ్చితార్థం చేసుకోవడంతో అందరి దృష్టి ఇపుడు వారి పెళ్లి పైన పడింది.
పెళ్లి జరిగిపోయిందా?
ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా వీరిరువురు పెళ్లి చేసేసుకున్నారనే అనుమానాలను ఈ క్లిప్పింగ్ రెట్టింపు చేసింది. అసలు విషయంలోకి వెళితే, ఇటీవల నయన్- విగ్నేష్ తమిళనాడులోని ఓ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అయితే ఆ ఆలయంలో నయనతార నుదుటిపై కుంకుమ పెట్టుకొని కనిపించడంతో వీళ్లిద్దరి మ్యారేజ్ జరిగిపోయిందని అందరూ అనుకుంటున్నారు. సదరు వీడియోను వైరల్ చేస్తూ వీరి పెళ్లి జరిగిపోయింది కానీ బయటికి మాత్రం చెప్పడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.