NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలు చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలను తీసుకున్నారు.

ఇప్పటికే కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఎంపిక పూర్తి అయినప్పటికీ పలు నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తడంతో అక్కడ అభ్యర్ధుల మార్పునకు ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తొంది. అలానే ఉమ్మడి ప్రచారానికి గానూ రూట్ మ్యాప్ సిద్దం చేయాలని నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారానికి పలువురు స్టార్ క్యాంపెయినర్లను కూడా ఎన్డీఏ కూటమి ఎంపిక చేసింది. ప్రధానంగా ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం బూత్ లెవల్, అసెంబ్లీ లెవల్ నుండి పార్లమెంట్ స్థాయి వరకూ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ప్రచారం, ఎన్నికల నిర్వహణ వ్యవహారాలను పరిశీలించేందుకు, వ్యూహాలను సిద్దం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఖరారు చేశారు. ఓట్ల బదిలీలపై క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా నేతలు చర్చించారు. చాలా ప్రాంతాల్లో నేతలు మంచి సమన్వయంతో వెళ్తున్నారని, ఇది మంచి పరిణామమని నేతలు అభిప్రాయపడ్డారు. గోదావరి జిల్లాల్లో జరిగిన కూటమి సభలు సక్సెస్ పై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి సభలు కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు. ఇదే మాదిరిగా  సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని నేతలు నిర్ణయానికి వచ్చారు.

ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఈసీకి ఉమ్మడిగా ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకునే వరకూ పారాడాలని నిర్ణయించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీతో సహా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేయనున్నారు.

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?