నీతూ అంబానీ మోసం చేస్తారా? కరోనా కాలంలో కొత్త ట్విస్టు తప్పదా?

 

 

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ దేశాన్ని మోసం చేస్తారా..> ఇచ్చిన మాట తప్పుతారా..? దేశానికి అతి పెద్ద దిగ్గజంగా పేరున్న అంబానీ చివరకు కరోనా విషయంలో వెనుక అడుగు వేసారా అంటే అలాగే ఉంది ప్రస్తుత పరిస్థితి.
(అదేమిటో చదవండి)

కరోనా తీవ్రంగా ఉన్నపుడు … కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు టీకా కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినపుడు ముఖేష్ అంబానీ సతీమణి నీతూ అంబానీ అన్నమాట ఏమిటంటే
” భారతదేశ మొత్తానికి, గ్రామగ్రామాన వెళ్లి కరోనా టీకా అందించే బాధ్యతలు రిలయన్స్ ఫౌండేషన్ తీసుకుంటుంది. ఎంత ఖర్చు అయినా మేము భరిస్తాం”
అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ విషయంలో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతుంది. దీనిపై మళ్ళీ రిలయన్స్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం, మరో పక్క టీకా పంపిణీకి సంబంధించి మంగళవారం ప్రధాని నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో సైతం దీనిపై మోడీ నోటా ఎలాంటి ప్రకటన రాలేదు. టీకా పంపిణీకి సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని, వచ్చే రెండు, మూడు నెలల్లో  టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖా ద్వారా టీకా మొదటి ప్రాధాన్యాలు ఎవరికీ..? టీకా రక్షణ..? రవాణా..? ప్రజలకు అందుబాటులోకి ఎలా తీసుకువస్తారో, వారికీ దాన్ని ఎలా వేస్తారో ఒక ప్రణాళిక ప్రకారం చూసుకోవాలని మోడీ సూచించారు. దీనిలో ఎక్కడ రిలయన్స్ పేరు లేదు.

లేనిపోని సమస్యలు వస్తయనా?

టీకా పంపిణి కార్యక్రమంలో రిలయన్స్ ను బాద్యులను చేస్తే కొత్త సమస్యలు వస్తాయి అని కేంద్రమే రిలయన్స్ ను దీనిలోకి తీసుకు వచ్చే ఆలోచనం చేయడం లేదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కీలకమైన సమయంలో ఎలాంటి చిన్న తప్పిదం జరిగిన దాన్ని ప్రభుత్వం మీద పెట్టేందుకు విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని, అసలే జమిలి ఎన్నికల ఆలోచన ఉన్న సమయంలో రిలయన్స్ టీకా పంపిణీలో ఏ మాత్రం అటుఇటు అయినా పెను మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేంద్రంలోని పెద్దలు ఆలోచించినట్లు తెలుస్తుంది.

భారం ఎక్కువే

టీకా దాదాపు ఇండియాలోనే తయారు అయ్యే అవకాశారు ఉన్నాయి. పుణెలోని సీరం టీకా ఇనిస్టిట్యూట్ లోనే  టీకా తయారీ ఉంటుందని.. ఇక్కడ రోజుకు మిలియన్ టీకాల తయారీ సామర్థ్యం ఉందని తెలుస్తోంది. ఇతర దేశాలు అభివృద్ధి చేస్తున్న టీకా తయారీని కూడా సీరం చూస్తోంది. అంటే ఆయా దేశాలు, కంపెనీలు అభివృద్ధి చేసిన ఫార్ములా ఆధారంగా కేవలం తయారీ మాత్రమే సీరం చూస్తోంది. పూణే నుంచే టీకా దేశమంతటా వెళ్తుంది అని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి రవాణా కీలకం. సాధారణ రవాణా కాకుండా అత్యంత సున్నితంగా, అన్ని జాగ్రత్తలు తీసుకుని మరి టీకాను రవాణా చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ ఆయా ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు పంపడం, అక్కడ సురక్షితంగా భద్రపరచడం పెద్ద పనే. దీనికి కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మరి దీనిపై మొదట హామీ ఇచ్చినట్లు రిలయన్స్ కనీసం పంపిణీలో పాల్గొంటుందా లేక కేవలం కొంత మొత్తం నిధులు అందజేసి తప్పుకుంటుందా అనేది చూడాలి