Sekhar kammula: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్లాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. డాలర్ డ్రీంస్ సినిమాతో దర్శకుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా అంతగా ప్రేక్షకులకి తెలియకపోయినా ఇండస్ట్రీ వర్గాలలో మాత్రం ఈ సినిమా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ తర్వాత ఆనంద్ అనే సినిమా తీశాడు. వాస్తవంగా ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదా సూపర్ స్టార్ మహేశ్ బాబులతో చేయాలనుకున్నాడు. కానీ ఇండస్ట్రీలో అంత గుర్తింపు లేని కారణంగా వారిని ఒప్పించలేకపోయాడు.
ఎట్టకేలకి అప్పటికి కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న ఆనంద్ తో ఈ సినిమాను తీశాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ద్వారా కమిలినీ ముఖర్జీ హీరోయిన్గా పరిచయం అయింది. మంచి కాఫీ లాంటి సినిమా అంటూ క్యాప్షన్ పెట్టి తీసిన ఆనంద్ సినిమా శేఖర్ కమ్ములకి చాలా మంచి పేరు తీసుకు వచ్చింది. ఒకే ఒక్క థియోటర్లో రిలీజైన ఆనంద్ సినిమా ఆ తర్వాత పాజిటివ్ టాక్‌తో క్రమంగా థియోటర్స్ పెరిగి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇంత విశేషంగా ఆకట్టుకోవడంతో ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల పేరు బాగా వైరల్ అయింది.
Sekhar kammula: రెండవ సినిమాతో దర్శకుడిగా శేఖర్ కమ్ముల నిలబడ్డాడు.
అలా రెండవ సినిమాతో దర్శకుడిగా శేఖర్ కమ్ముల నిలబడ్డాడు. ఈ సినిమాల తర్వాత సుమంత్ హీరోగా గోదావరి సినిమా తెరకెక్కించాడు. ఇందులో కూడా హీరోయిన్గా కమిలినీ ముఖర్జీ నటించింది. గోదావరి అందాలను ఎంతో ఆహ్లాదకరంగా చూపించాడు. కమర్షియల్ సినిమాలతో విసిగిపోయి ఉన్న జనాలకి గోదావరి సినిమా చాలా రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకున్నారు. అంత ఆహ్లాదకరమైన సినిమాతో శేఖర్ కమ్ముల మరో హిట్ అందుకున్నాడు. స్టార్ హీరోలు లేకుండానే కథను నమ్మీ సినిమా తీస్ హిట్ కొడుతున్నాడని చెప్పుకున్నారు.
ఇక ఆయన కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందించిన హ్యాపీడేస్ సినిమా మైల్ స్టోన్‌లా శేఖర్ కమ్ముల జీవితంలో నిలిచిపోయింది. ఈ సినిమా కాలేజీ స్టూడెంట్స్ కి ఓ ఫీవర్లా పట్టుకుంది. ఎక్కడ చూసిన స్టూడెంట్స్‌తో థియేటర్స్ నిండిపోయి ఓ సంచలన సృష్ఠించింది. నువ్వే కావాలి, నువ్వు నేను సినిమాల తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న సినిమా అఖండ విజయాన్ని అందుకున్న సినిమా హ్యాపీడేస్. దీంతో ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల స్టార్ డైరెక్టర్‌గా మారాడు.
Sekhar kammula: రానాతో తీసిన లీడర్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇక రానాతో తీసిన లీడర్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ హీరోని లాంచ్ చేసే బాధ్యత ఏకంగా శేఖర్ కమ్ముల మీద పెట్టారంటే ఆయనను ఎంతగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి లీడర్ సినిమాతో రానాని బాగానే చూపించాడు. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ యూత్ లవ్ స్టోరీ అంటూ లైఫ్ ఈజ్ బ్యూటి్‌ఫుల్ సినిమాను తీశాడు. ఈ సినిమాలో కూడా అందరూ కొత్తవాళ్ళని తీసుకొని రూపొందించాడు. అయితే హ్యాపీడేస్ హ్యాంగోవర్ నుంచి ఇంకా శేఖర్ కమ్ముల బయటకి రావడం లేదంటు కామెంట్స్ వినిపించాయి. సినిమా కూడా ప్రేక్షకులకి నచ్చలేదు. దాంతో ఈ సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. కాగా ఫిదా సినిమాతో భారీ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుష్‌తో పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే నాగ చైతన్య – సాయి పల్లవిల కాంబినేషన్లో రూపొందించిన లవ్ స్టోరి రిలీజ్‌కి రెడీగా ఉంది.