ఆ కుటుంబం త్యాగాలు కనబడవా?!

గాంధీ- నెహ్రూ కుటుంబం దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఆ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని పేర్కొన్నారు.ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా దేశంలో రైతులు, పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఆ కుటుంబ త్యాగాలు ప్రధాని మోడీకి కనపడటం లేదా అని ప్రశ్నించారు. మోడీ ఒక కుటుంబం దేశాన్ని నాశనం చేస్తుందని అంటూ నెహ్రూ-గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించడాన్ని ఆయన తప్పుపట్టారు. దేశ స్వాతంత్ర్యోద్యమం, స్వతంత్ర భారత అభివృద్ధిలోనూ ఆ కుటుంబం చేసిన కృషి ఎన్నదగినదని ప్రశంసించారు.