నేపాల్ నూతన ప్రధానిగా మావోయిస్టు నేత పుష్పకమల్ దహాల్ (ప్రచండ) నియమితులైయ్యారు. నేపాల్ అధ్యక్షురాలు విద్యావేది భండారీ ఆయనను నేపాల్ తదుపరి ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచండ ఇంతకు ముందు 2008 నుండి 2009 వరకూ, మళ్లీ 2016 నుండి 2017వరకూ రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ రోజు (ఆదివారం) ఆరు పార్టీల నేతలు సమావేశమై ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటునకు ఏకాభిప్రాయానికి రావడంతో నేపాల్ లో ఇప్పటి వరకూ నెలకొని ఉన్న రాజతీ అనిశ్చితికి తెరపడింది. ఈ సమావేశంలో పుష్పకమల్ దహాల్ (ప్రచండ) మొదటి రెండున్నర సంవత్సరాలు, సీపీఎన్ – యూఎంఎల్ కూటమి తర్వాత రెండున్నర సంవత్సరాలు ప్రధాని పదవులు చేపట్టాలని నిర్ణయించినట్లుగా నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు సెంటర్) నాయకుడు బర్షమన్ పన్ తెలిపారు.

ఆరు పార్టీల కూటమి సమావేశం అనంతరం ప్రచండ అధ్యక్ష కార్యాలయంలో నేపాల్ అధ్యక్షురాలు విద్యదేవి భండారిని కలిసి తన ప్రధాని అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలుపాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అధ్యక్షురాలు ప్రచండ వినతిని ఆమోదిస్తూ ఆయనను ప్రధానిగా నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను రాష్ట్రపతి కార్యాలయం వెలువరించింది. దీంతో స్థానిక కాలమానం ప్రకారం రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రచండ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న ప్రచండ ఈ సారి రెండున్నర సంవత్సరాలు పదవిలో కొనసాగనున్నారు.

కొత్త సంకీర్ణంలో .. సీపీఎన్ – యూఎంఎల్ కు 78 మంది, మావోయిస్టు సెంటర్ కు 32 మంది, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి 20 మంది, రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీకి 14 మంది, జనతా సమాజ్ వాది పార్టీకి 12 మంది, జనమత్ పార్టీకి ఆరుగురు, నాగరిక్ ఉమ్మక్త్ పార్టీకి నలుగురు ఎంపిల బలం ఉంది. దీంతో అధికార కూటమికి మొత్తం ఎంపీల బలం 166గా ఉంది.
Omicron BF 7: మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ప్రజలకు ప్రత్యేక సూచనలు
