NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Breaking: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం .. 40 మందికి పైగా మృతి.. విమానంలో అయిదుగురు భారతీయులు

Breaking:  నేపాల్ లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఖాట్మండు నుండి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్ లైన్స్ కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రయాణీకుల్లో అయిదుగురు భారతీయులు, నలుగురు రష్యన్, ఇద్దరు సౌత్ కొరియా, ఒకరు ఐరిష్ దేశస్తులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పొఖరా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పాత ఎయిర్ పోర్టు మధ్య చోటుచేసుకుంది. ఈ విషయాన్ని యతి ఎయిర్ లైన్స్ సిబ్బంది సుదర్శన్ బర్తౌలా దృవీకరించారు.

Nepal plane crash

 

ఈ ప్రమాదం లో ఇప్పటి వరకూ 40 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తెక్ బహదూర్ కేసి స్థానిక మీడియాకు వెల్లడించారు. విమానంలోని వారు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీగా మంటలు చెలరేగడంతో భధ్రతా సిబ్బందిని నియమించామని చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం జరగడంతో పొఖరా ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెప్ప తప్ప మొత్తం కాలిపోయింది.

Nepal plane crash

ఈ విమాన ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, హోంశాఖ వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju