‘విరుష్క’ లది టాప్ రిచెస్ట్ సెలబ్రిటీ జోడి.. నెట్‌వర్త్ ఎంతో తెలుసా???

క్రికెటర్‌ కోహ్లీ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ క్వీన్‌ అనుష్క శర్మలు తమ తమ రంగాల్లో కోట్లు సంపాదిస్తూ దేశ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అయితే వీరి ఇరువురి సంపాదన సుమారుగా ఎంత ఉంటుంది అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ ఇద్దరి నెట్‌వర్త్ ఈ సంవత్సరం రూ. 1200 కోట్లకు చేరిందని మరియు వీరిది ఇండియాలోనే రిచెస్ట్ సెలెబ్రిటీ జోడీగా నిలిచిందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.

‘విరుష్క’ లది టాప్ రిచెస్ట్ సెలబ్రిటీ జోడి.. నెటవర్త్ ఎంతో తెలుసా???

2013లో షాంపూ అడ్వర్టైజ్‌మెంట్ కోసం తొలిసారి విరాట్ మరియు అనుష్క కలుసుకున్నారు. వీరు 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహమైనప్పటికి అనుష్క తన కెరీర్‌ను కొనసాగించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరి సంపాదనలో ప్రధాన భాగం అడ్వర్టైజ్‌మెంట్స్ ఒప్పందాల నుంచి వచ్చినవే.

‘విరుష్క’ లది టాప్ రిచెస్ట్ సెలబ్రిటీ జోడి.. నెటవర్త్ ఎంతో తెలుసా???

2019 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, విరాట్ కోహ్లీ టాప్-100 సెలెబ్రెటీస్‌లో ఒకడు. విరాట్ సంపాదన రూ.900 కోట్లుగా ఉంటుందట. విరాట్ కోహ్లీ సంపాదనలో ప్రధాన భాగం తన సొంత వ్యాపార పెట్టుబడులు, మరియు అడ్వర్టైజ్‌మెంట్ ఒప్పందాల నుంచే వస్తోంది. క్రికెట్ ‌పరంగా బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్లు ఆర్జిస్తున్నాడు విరాట్ కానీ ఐపీఎల్‌లో ఆర్సీబీ నుంచి మాత్రం 18 కోట్లు తీసుకుంటున్నాడు. అతనికి రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి.

‘విరుష్క’ లది టాప్ రిచెస్ట్ సెలబ్రిటీ జోడి.. నెటవర్త్ ఎంతో తెలుసా???

ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 2019 లో అనుష్క నెట్‌వర్త్ రూ.350 కోట్లకు పై మాటే. అనుష్కకు ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ మరియు గూర్గాన్ లో రూ. 80 కోట్ల విలువ చేసే ఆస్థులున్నాయని ప్రచారం జరుగుతోంది.