అమెరికన్ నటి జెన్నిఫర్ అనిస్టన్ లంగా వోణిలో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె హీరోయిన్‌గా లేటెస్ట్ నటించిన చిత్రం ‘మర్డర్ మిస్టరీ-2’. నెట్‌ఫిక్స్ వేదికగా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జెర్మీ గెరెలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆడమ్ సాండ్లర్ హీరోగా నటిస్తున్నారు. 2009లో విడుదలైన మర్డర్ మిస్టరీకి సీక్వెల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌కు భారీ స్థాయిలోనే రెస్పాన్స్ వస్తోంది. కామెడీ, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆడమ్ సాండ్లర్ న్యూయార్క్ సిటీ పోలీస్ ఆఫీసర్‌గా ఉంటారు. ఆమె భార్య జెన్నిఫర్ అనిస్టన్ హెయిర్ డ్రెస్సర్‌గా, మర్డర్ మిస్టరీ స్టోరీలు రాస్తుంటుంది. ట్రైలర్ మధ్యలో ఈ జంట కలిసి ఒక ఐల్యాండ్‌లో ఓ మహరాజు పెళ్లికి వెళ్తారు. గుర్రంపై రాజు వస్తుండగా.. చనిపోయి కింద పడతాడు. తాను మహరాజు కాదని, మహరాజు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకున్న ఆడమ్ సాండ్లర్.. కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆయనకు తోడుగా భార్య జెన్నిఫర్ అనిస్టన్ కూడా సాయం చేస్తుంది. ఈ ఇద్దరు భార్యాభర్తలు ఈ కేసును ఎలా ఛేదిస్తారు? వాళ్లకు ఎదురైన ఆటంకాలేంటీ? వంటి అంశాలపై స్టోరీని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.

మంగళవారం విడుదలైన ఈ ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. హాలీవుడ్ చిత్రమైనప్పటికీ.. హిందూ సంప్రదాయాన్ని ఫాలొ అయినట్లు అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా జెన్నిఫర్ అనిస్టర్ లంగా వోణిలో దర్శనమిస్తుంది. లంగా వోణిలో జెన్నిఫర్ అనిస్టన్ ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జెన్నిఫర్ అనిస్టన్ లంగా వోణి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు ఆమె ఫోటోలను షేర్ చేస్తూ.. జెన్నిఫర్ అందాలను పొగిడేస్తున్నారు. అందానికే అందం వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.