బిగ్ బాస్ 4: హౌస్ లో ఆ ముగ్గురికి తీరని అన్యాయం జరిగింది ..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మొదటిలో తెలిసి తెలియని ముఖాలు కనబడటంతో ఈ సీజన్ పెద్ద ఏమి ఉండదని పైగా ఐపీఎల్ కూడా మధ్యలో రావడంతో ఇక అయిపోయినట్లే అని బయట జనాలు నెటిజన్లు భావించారు. కానీ షో నిర్వాహకులు ఎప్పటికప్పుడు హౌస్ లో సరికొత్త టాస్క్ లు ఉండేవిధంగా చూసుకుంటూ, మరోపక్క వైల్డ్ కార్డు రూపంలో కొత్త కొత్త వారిని ఇంటిలోకి పంపి షోపై చూసే ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించేలా బాగా రాణించారు.

Bigg Boss Telugu 4: Makers Unveil Teaser & Logo Of Upcoming Seasonఒకపక్క ఇప్పుడు జరుగుతున్న గానీ టిఆర్పి రేటింగులు విషయంలో బిగ్ బాస్ షో వల్ల రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నట్లు హోస్ట్ నాగార్జున చెప్పుకొస్తున్నారు. అంతా బాగానే ఉన్నా గానీ ఎలిమినేషన్ ప్రక్రియలో ఆడియన్స్ ఓటర్లకు విలువ ఇవ్వకుండా షో నిర్వాహకులు తమకు ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని… అలాంటప్పుడు చూసే ప్రేక్షకులను ఓట్లు వేయమని అడగటం దేనికని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆరో వారం చివరిలో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కుమార్ సాయి ఎలిమినేషన్ అన్యాయం అని పేర్కొంటున్నారు.

 

కుమార్ సాయి కంటే తక్కువ ఓట్లు మోనాల కి వచ్చాయని.. భావిస్తూ ఆమెని ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు సేవ చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ విషయంలో కూడా మతలబు జరిగిందని ఈ ముగ్గురికి హౌస్ లో తీరని అన్యాయం జరిగిందని బయట జనాలు సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు.