బిగ్ బాస్ 4: దివి ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు..!!

దసరా పండుగ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున ప్లేసులో చేసిన సమంత యాంకరింగ్ కి బయట మంచి రెస్పాన్స్ వచ్చింది. మామకు తగ్గ కోడలు అని సమంత యాంకరింగ్ పై చాలా మంది పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఏడవ వారం ముగిసి 8 వ వారంకి  చేరిన క్రమంలో లాస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియలో దీవి ఎలిమినేట్ అవ్వటం పట్ల సోషల్ మీడియాలో బిగ్ బాస్ షో నిర్వాహకులపై సెటైర్లు పడుతున్నాయి.

బిగ్‌బాస్ నుంచి దివి వద్మా అవుట్.. సమంత ఎమోషనల్‌.. కంటతడితో.. | Divi Vadthya eliminated from Bigg Boss Telugu 4, Samantha akkineni gets emotional - Telugu Filmibeatఅంతా స్క్రిప్ట్ పరంగానే హౌస్ లో కథ నడుస్తుందని… చూస్తున్న ప్రేక్షకులు ఓట్లు ఇస్తున్న వాళ్లని ఆటలో అరటిపండు చేసి ప్రేక్షక ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లు బయట జనాల తో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. దివి ఇంటి సభ్యులలో బెస్ట్ కంటెస్టెంట్ అని… దివి కంటే మోనాల్ వరెస్ట్ కంటెస్టెంట్ అని సోషల్ మీడియాలో జనాలు కామెంట్లపై కామెంట్లు చేస్తున్నారు.

 

అసలు సీజన్ ఫోర్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా స్క్రిప్టు పరంగా జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఇంటిలో నుండి దివి ఎలిమినేషన్ అవ్వడం వల్ల జనాలు మండిపడుతున్నారు. ఏదిఏమైనా ఇంటిలో జరుగుతున్న ఆటలు ఎలిమినేషన్ అంతా స్క్రిప్టు పరంగా నే జరుగుతున్నట్లు బయట జనాల టాక్.