ఎస్పీబీ చనిపోతే ఆ తెలుగు మీడియా పెద్దాయపై ఎందుకు ఫైర్ అవుతున్నారంటే…

భారతీయ సంగీత వైభవ పతాక శ్రీ‌పతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం… మ‌నంద‌రినీ వీడి దిగంతాల‌కు చేరారు.

netizens trolling the media moghal
netizens trolling the media moghal

40 వేల పాటలు పాడి గిన్నీస్‌ బుక్‌కెక్కిన ఆయన బోలెడన్ని పాత్రలు ధరించడం, చిత్రాలు నిర్మించడం బహుముఖ నైపుణ్యానికి అద్దం పడతాయి.సంగీత దర్శకత్వం సరేసరి. అనర్గళ వ్యాఖ్యాతగా సంగీత కచేరిను ఆధునికం చేసి దేశ విదేశాలో ఎందరికో స్పూర్తినీ ఉపాధినీ ఇచ్చారు. అయితే, బాలు క‌న్ను మూసిన త‌రుణంలో కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

ఎస్పీబీ క‌న్నుమూత‌

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో తనువు చాలించారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. కరోనా సోకటంతో ఆగస్టు 5న దవాఖానలో చేరిన బాలుకు గుండె, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రం కావటంతో.. ఆ లెజెండరీ గాయకుడి ప్రాణాలను కాపాడలేకపోయామని ఎంజీఎం దవాఖాన యాజమాన్యం ప్రకటించింది. బాలు మృతితో సినీ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఆయనకు అక్షర నివాళులు అర్పించారు. చెన్నై సమీపంలోని తమరాయిపక్కంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో బాలు పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి.

మ‌హాగాయ‌కుడి మ‌ర‌ణం వెనుక‌…

మహాగాయకుడి మరణాన్ని తట్టుకోలేక సంగీత, సినీ ప్రపంచం తల్లడిల్లుతోంది. ఇదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో ప‌లువు‌రు నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కరోనాతో బాలు ఆగస్టు 5న ఎంజీఎంలో చేరారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో అదే నెల 14న ఆయనకు కృత్రిమ శ్వాస అందించటం మొదలుపెట్టారు. దాంతో క్రమంగా కోలుకున్న బాలు ఈ నెల 4న కరోనా నుంచి బయటపడ్డారు. పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని దవాఖాన వర్గాలు 4వ తేదీన ప్రకటించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటినుంచి ఫిజియో థెరపీ తదితర చికిత్సలు అందించటంతో తనంతతానుగా ఆహారం తీసుకొనే స్థితికి చేరుకున్నారు. అంతలోనే అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో గురువారం నుంచి ఆయనకు అన్నిరకాల అత్యవసర చికిత్సలు అందించారు. అయినా ఫలితం లేకపోయింది.

సోష‌ల్ మీడియాలో ఏమంటున్నారంటే…

ఎక్కడిదీ కరోనా.. ఏమిటి ఈ కరోనా అంటూ గళం విప్పి నిలదీసిన గాన గంధర్వుడు చివరకు ఆ కరోనాబారినే పడ్డారు. అయితే, ఈ మ‌హమ్మారి బారిన ప‌డ‌టానికి తెలుగు మీడియాలోని ఓ సంస్థ అధిప‌తి చేసిన నిర్వాకం అని అంటున్నారు. హైద‌రాబాద్‌లో బాలు కీల‌క పాత్ర పోషించే ఆ కార్య‌క్ర‌మం క‌రోనా స‌మ‌యంలో నిలిచిపోయింది. అన్‌లాక్ మార్గ‌ద‌ర్శ‌కాల నేప‌థ్యంలో మ‌ళ్లీ స‌ద‌రు ఛాన‌ల్ తిరిగి తెర‌కెక్కేందుకు సిద్ధ‌మైంది. బాలును సైతం పాల్గొన‌వ‌ల‌సిందిగా వారు ఆహ్వానించారు. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా త‌న ఉధృతి కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో తాను హైద‌రాబాద్ రాలేన‌ని, చెన్నైలోనే కొద్దికాలం ఉంటాన‌ని బాలు తెలియ‌జేశార‌ట‌. అయితే, స‌ద‌రు సంస్థ అస్స‌లు వినిపించుకోక‌పోవ‌డంతో… బాలు త‌ప్ప‌నిస‌రిగా అందులో పాల్గొన్నార‌ని ప్ర‌చారం. స‌ద‌రు కార్య‌క్ర‌మానికి సంబంధించిన బృందంలో కొంద‌రు అప్ప‌టికే కోవిడ్ బారిన ప‌డ‌టంతో బాబు ఈ మ‌హమ్మారికి గుర‌య్యార‌ని అనంత‌రం ప్రాణాలు కోల్పోయార‌ని చెప్తున్నారు. స‌ద‌రు ` తెలుగు మీడియా మొఘ‌ల్‌` చేసిన ప‌నికి దేశం గ‌ర్వించ‌ద‌గ్గ గాయ‌కుడిని కోల్పో‌యామ‌ని విల‌పిస్తున్నారు.