Bigg Boss 5 Telugu: శివ జ్యోతి నీ గుర్తు చేస్తున్నాడు అంటూ ఆ కంటెస్టెంట్ నీ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!!

Share

Bigg Boss 5 Telugu:  బిగ్ బాస్ సీజన్ 3 లో మంచి లేడీ ఫైటర్ గా పేరు సంపాదించిన కంటెస్టెంట్ శివజ్యోతి. హౌస్ లో ఉన్నంత కాలం పాయింట్ టు పాయింట్ మాట్లాడటంలో.. టాస్క్ ఆడటంలో మగవారికి మంచి పోటీ ఇచ్చేది. అభినందించాల్సిన సమయంలో అభినందించటం తో పాటు.. కడిగిపారేసే టైంలో కడిగిపారేసిది. హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా పేరు సంపాదించిన శివ జ్యోతి కి నెగిటివ్ ఏదైనా ఉంది అంటే.. అది బోరున ఏడవటం. ఏటువంటి సందర్భంలో అయినా.. హౌస్ లో ఎవరైనా తమ బాధ చెప్పుకున్న లేకపోయినా తనని చిన్న మాట అన్న గాని.. శివజ్యోతి కంటి నిండా నీళ్ళు జల జల జల పాతం మాదిరిగా వచ్చేసేవి. అప్పట్లో గేమ్ అంతా బాగా ఆడిన గాని శివ జ్యోతి .. చీటికీ మాటికీ ఆడటం వల్ల ఆమెకి కొద్దిగా మైనస్ అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సీజన్ ఫైవ్ స్టార్ట్  అయిన సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu: Vishwa Gets Emotional, Anee, Kajal Burst - Sakshi

హౌస్ లో ఇంటి సభ్యులు 24 గంటలు గడపకముందే… ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి వారి మధ్య చిచ్చు పెట్టాడు బిగ్బాస్. దీంతో చిన్న చిన్న కారణాలు తీసుకుని… ఇంటి సభ్యులు నామినేషన్ ప్రక్రియ సెకండ్ డే చేయడం జరిగింది. ఈ పరిణామంతో ఇంటిలో గ్రూపులు మరియు తగాదాలు స్టార్ట్ అయ్యాయి. ఏకంగా 19 మంది హౌస్ లో ఉండటంతో ఇప్పుడిప్పుడే .. ఎంటర్టైన్మెంట్ తో పాటు.. గ్రూపులు క్రియేట్ అవుతున్నాయి. కాగా తాజాగా మూడో రోజు.. ఇంటిలో ఎమోషనల్ సీన్ క్రియేట్ అయింది. విషయంలోకి వెళితే.. రవి టాస్క్ లో భాగంగా విశ్వ ఆదేశాల మేరకు లేడీస్ డ్రెస్ వెయ్యాలని తెలియజేస్తారు. ఈ క్రమంలో లేటెస్ట్ డ్రెస్ వేసుకుని వచ్చిన రవిని విశ్వ అమాంతం ఎత్తుకుని.. డాన్సులు వేస్తూ గాలిలో తిప్పుతూ.. రొమాంటిక్ డాన్స్ వేయడం జరుగుతుంది. అనంతరం ఇంటిలో ఓ మూలన కూర్చుని.. విశ్వ.. రవి గురించి మాట్లాడుతూ… ఫస్ట్ నుండి ఇంటిలో ఎటువంటి అభిప్రాయం కలిగి అడుగు పెడతారు అదే చివరి వరకు కొనసాగించాలని విశ్వ తనతో పాటు వచ్చిన సభ్యులకు తెలియజేశారు.

బోరున ఏడ్చేసిన విశ్వ..

ఈ క్రమంలో రవి తనకి మా మ్యూజిక్ లో కెరీర్ స్టార్ట్ చేసిన నుండి తనకు తెలుసని… అప్పట్లో రవి తనని అన్నా అని పిలిచేవాడిని అదే పిలుపు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన టైంలో కూడా.. అతడు నన్ను చూసినప్పుడే పిలుపుతో పిలిచాడని రవి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అదే విధంగా ఉన్నాడని విశ్వ పొగడ్తల వర్షం కురిపించారు. అంత మాత్రమే కాక తాను డ్రెస్ వేసుకో మన ఎటువంటి అబ్జెక్షన్ పెట్టుకోకుండా రవి వేసుకోవటం నిజంగా గ్రేట్ అని.. రవి ని చూస్తే తనకు తన తమ్ముడు గుర్తొస్తున్నాడు అని విశ్వ ఎమోషనల్ గా ఫీల్ అయిపోయాడు. విషయంలోకి వెళితే గత ఏడాది తన తమ్ముడు చనిపోయాడు అని .. కండలు కలిగిన విశ్వ ఒక్కసారిగా బోరున ఏడ్చేయడంతో .. చుట్టుపక్కల ఉన్న మనస్, శ్రీరామ్, రవి కూడా ఎమోషన్ అయ్యారు. ఈ క్రమంలో రవి… విశ్వ ని పట్టుకుని తనని తమ్ముడు అని ఫీల్ అవ్వాలి అని ఏడవద్దు అని ఓదార్చాడు. అయినా కానీ బోరున ఏడవటంతో మిగతా ఇంటి సభ్యులు వచ్చి… విశ్వ నీ ఓదార్చడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత… ఎవరికి వారు డిస్పాసయ్యారు. అయితే ఈ సన్నివేశం చూసిన బిగ్ బాస్ అభిమానులు వీక్షకులు… ఎమోషనల్ డ్రామా ఆడుతున్నాడు విశ్వ.. పబ్లిసిటీ స్టంట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొంతమంది బిగ్ బాస్ సీజన్ త్రీ లో శివ జ్యోతిని తలపించే రీతిలో.. విశ్వా గేమ్ ప్లే చేస్తున్నాడని… నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా మంచి కండలు కలిగిన ..ఫిజిక్ ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న విశ్వ వెక్కివెక్కి ఏడవటం.. మూడో రోజు ఎపిసోడ్ లో సెన్సేషనల్ గా మారింది.


Share

Related posts

 Telangana Government : ఈ -గోల్కొండ పోర్టల్ ను లాంచ్ చేసిన కేటీఆర్..!!

bharani jella

బాలికపై ఎస్పీ లైంగిక దాడి

Mahesh

పోల్ : జగన్ మంత్రివర్గంలో మంత్రుల ఏడాది పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి, వారి శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారా…?

ramu T