NewsOrbit
టెక్నాలజీ న్యూస్

ఇండియాలోకి అడుగుపెడుతున్న కొత్త బైకులు..! ఫీచర్లు చూస్తే కుర్రకారు అసలు ఆగలేరు..!!

 

వాహన ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో మిడిల్-వెయిట్ మోటార్‌సైకిల్ ఒకటి..! గ్లోబల్ మార్కెట్లలో మాదిరిగానే భారత్‌లో కూడా మిడిల్-వెయిట్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ విభాగం అత్యంత ప్రాచురాన్ని సంతరించుకుంటోంది..! స్పోర్టీ లుక్స్, అద్భుతమైన ఎలక్ట్రానిక్స్ , సాటిలేని పనితీరు వీటి ప్రత్యకం..! ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా భారత మార్కెట్లో త్వరలోనే రెండు సరికొత్త ఆర్‌ఎస్ 660, టుయోనో 660 మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది..! మిడిల్ వెయిట్ ప్రీమియం బైక్స్ విభాగంలో ప్రవేశపెట్టనుంది..! ఈ సరికొత్త మోడళ్ల పూర్తి సమాచారం ఇలా ..

 

RS 600

 

ఈ రెండు బైక్స్ మధ్య అనేక స్పేర్ పార్ట్శ్ , ఫీచర్లు ఒకేలా ఉంటాయని సమాచారం. వీటిలో డిజైన్, ఇంజన్ ఆప్షన్లు వేరు. అపెక్స్ బ్లాక్, యాసిడ్ గోల్డ్, లావా రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అప్రిలియా ఆర్ 660 మోడల్‌ను దాని బిగ్ బ్రదర్ అయిన ఆప్రిలియా ఆర్ఎస్‌వి4 డిజైన్ మాదిరిగా తయారు చేశారు. ఇది ఆర్ఎస్‌వి4 లో కనిపించినట్లుగా ఫుల్ ఫెయిరింగ్, ఏరో వింగ్లెట్లతో అగ్రెసివ్ లుక్‌ని ఇస్తుంది. ఇందులో రేస్-స్పెక్ స్టైల్ వింగ్లెట్స్ అధిక వేగంతో వెళ్తున్నపుడు ఏరోడైనమిక్ స్థిరత్వాన్ని అందిస్తాయి. ఈ మోడల్‌లో బ్రాండ్ యొక్క సిగ్నేచర్ త్రీ పార్ట్ ఎల్ఈడి హెడ్‌లైట్ ఉంది. దానికి ఇరువైపులా ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్లు ఉంటాయి. స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు షార్ప్ క్రీజ్ లైన్లతో ఈ మోటారుసైకిల్ అగ్రెసివ్ లుక్ మరింత మెరుగ్గా ఉంటుంది. ఆర్ఎస్ 660 వెనుక డిజైన్ చూడటానికి ఆర్ఎస్‌వి4 మాదిరిగానే కనిపిస్తుంది. ఇంజన్ విషయానికి వస్తే, ఆప్రిలియా ఆర్ఎస్ 660 మోడల్‌లో 660సిసి, పారలల్ ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్‌, 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంది.

 

 

ఇది ఈ విభాగంలోనే అత్యంత తేలికైన బైక్స్ లో ఒకటిగా నిలవనుంది. ఇందుల ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లను అందిస్తోంది. ఇంకా వీలీ కంట్రోల్, కార్నరింగ్ ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, ఐదు వేర్వేరు రైడ్ మోడ్‌లు, బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్ ఫీచర్లు అందిస్తుంది. 5 ఇంచ్ టిఎఫ్‌టి స్ప్లిట్-స్క్రీన్ డిస్‌ప్లే . ఇది అన్ని ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్ ఫీచర్లను కంట్రోల్ చేయటానికి, రైడర్‌కు వివిధ రకాల సమాచారాన్ని అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీని కూడా ఉంది. ఆర్‌ఎస్ 600 మోటార్‌సైకిల్‌లో ముందు వైపు కయాబా బ్రాండ్ నుండి గ్రహించిన 41 మిమీ, యుఎస్‌డి ఫోర్క్స్ మరియు వెనుక వైపు మోనో-షాక్ సెటప్ ఉంటాయి. ఈ రెండిటినీ పూర్తిగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముందు భాగంలో డ్యూయల్-డిస్క్ బ్రేక్‌లు ,వెనుక వైపున సింగిల్ డిస్క్-బ్రేక్ ఉంటాయి.

 

 

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju