Aadhaar: అవును.. ప్రతి ఏటా ఎంతమంది శిశువులు పుడుతున్నారో తెలిస్తే, నిజంగానే షాక్ కి గురవుతారు. తాజా గణాంకాలు చేబుతున్నది ఏమంటే, మరణించిన వారి కంటే కూడా పుడుతున్నవారి సంఖ్యే పెద్దదని చెబుతున్నారు. UIDAI (యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి సౌరభ్ జార్జ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం దాదాపు 131 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశామని వెల్లడించారు. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు ప్రతి ఏడాది ఎంతమంది పుడుతున్నారో అని.
సౌరభ్ జార్జ్ చెప్పిన మరిన్ని వివరాలివి..
సౌరభ్ జార్జ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సుమారుగా 2-2.5 కోట్ల మంది శిశువులు పుడుతున్నారని చెప్పారు. అలాగే వీరికి హాస్పిటల్ లోనే ఆధార్ కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీని కోసం రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ విభాగంతో భాగస్వామ్యం చేసుకుంటామని అంటున్నారు. ఈ లెక్కన ప్రతి ఏటా సుమారు 10 కోట్ల మందికి పైనే వారి వ్యక్తిగత ఆధార్లో పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ మొదలైన వివరాలను అప్డేట్ చేసుకుంటున్నారని అన్నారు.
ఆధార్ కార్డులో తప్పులు ఉంటాయా?
ఖచ్చితంగా.. తప్పులు చాలానే వుంటాయని మనలో చాలామందికి తెలుసు. మనలో కూడా చాలామంది తమ వ్యక్తిగత ఆధార్ తప్పులతో విసిగి వేసారిపోయి వుంటారు. ఎవ్వరో డిజిటల్ అసిస్టెంట్ చేసిన తప్పులకు మనం మూల్యం చెల్లించవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఇవి ఒక జీవితంతో ముడిపడి ఉంటాయి. సదరు వ్యక్తులకు ఇలాంటి తప్పిదాల వలన పూర్తి వ్యవస్థ పైనే నమ్మకం పోతుంది. అయితే ఈ తప్పులను సులభంగానే మార్చుకోవచ్చు. పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్, జెండర్, పుట్టిన తేదీ ఇలాంటి వివరాలు తప్పుగా ఉంటే ఆ వివరాలను కరెక్ట్ చేసుకొనే వెసులుబాటు వుంది. అయితే కొన్నింటికి మాత్రం డాక్యుమెంట్లు కచ్చితంగా కావాలి.